రామాయంపేట, జూన్ 01 : ఈనెల 3నుండి జరిగే రెవెన్యు సదస్సులను ప్రతి గ్రామంలో రైతులు విజయవంతం చేయాలని రామాయంపేట తహసీల్దార్ రజినీకుమారి పేర్కొన్నారు. ఆదివారం తన కార్యాలయంలో రెవెన్యు సదస్సుల డాటాను విడుదల చేసి సిబ్బందికి సూచనలు చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతు ఈనెల 3వ తారీఖు నుండి 20న వరకు ప్రతి గ్రామంలో రెవెన్యు సమావేశాలు ఉంటాయని భూ భారతికి సబంధించిన అంశాలను రెవెన్యు సదస్సులో రైతులు తెలుపాలన్నారు.
ఈ నెల 3న తొనిగండ్ల, 4న లక్ష్మాపూర్, 5న ఝాన్సీలింగాపూర్, సదాశివనగర్, 6న సుతారిపల్లి, శివ్వాయపల్లి, 9ప కోమటిపల్లి, 10న అక్కన్నపేట, 11న డి.ధర్మారం, 12న కోనాపూర్, 13న దామరచెర్వు, 16న దంతెపల్లి , 17న పర్వతాపూర్, 18న కాట్రియాల, 19న రాయిలాపూర్, 20న రామాయపేటలలో రెవెన్యు సదస్సులు జరుగుతాయన్నారు. ఈ సదస్సులలో రైతులకు సంబంధించిన భూ భారతి సమస్యలపై పరిష్కరించుకోవాలన్నారు.