వర్గల్, మే 31: సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలోని టీజీఐఐసీలోని శ్రీమహాదేవి ఆగ్రో ఇండస్ట్రీస్ వద్ద నుంచి ధాన్యం లోడ్‌తో డీసీఎం ్రడ్రైవర్ ఉడాయించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. రైతుల వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కుకునూర్‌పల్లి మండలం తిప్పారం కొనుగోలు కేంద్రం నుంచి 8 మంది రైతులకు చెందిన ధాన్యం 491 బస్తాలు లోడ్ చేసుకొని వర్గల్ టీజీఐఐసీలోని శ్రీమహాదేవి ఆగ్రో ఇండస్ట్రీస్‌కు గురువారం రాత్రి బయల్దేరింది.
అక్కడున్న సిబ్బంది అన్లోడ్కు సమయం పడుతుందని చెప్పడంతో, తిప్పారం గ్రామానికి చెందిన రైతులు తిరుగు ప్రయాణం అయ్యారు. తిరిగి శుక్రవారం ఆగ్రో ఇండస్ట్రీస్ సెంటర్‌కు వచ్చి చూసే సరికి, డీసీఎం లేకపోవడంతో అవాక్కయ్యారు. దీంతో తిప్పారం రైతులు వర్గల్ పోలీస్స్టేన్లో ఫిర్యాదు చేశారు.