సంగారెడ్డి జూలై 21 (నమస్తే తెలంగాణ): తుఫాన్ ప్రభావం వల్ల సంగారెడ్డి జిల్లాలో వర్షాలు పడుతున్నాయి.చాలా ప్రాంతాల్లో రోజంతా ముసురు కురిసింది. వర్షాల వల్ల వానకాలంలో సాగు చేసిన పంటలకు ఊపిరి ఊదినట్లు అవుతున్నది. వర్షాలు లేక నారాయణఖేడ్ ప్రాంతంలో పంటలు ఎండిపోతుండగా ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల్ల పంటలకు ప్రాణం పోసినట్లు అయ్యింది. జిల్లాలో అత్యధికంగా వర్షపాతం కంగ్టిలో 4.8 సెంటీ మీటర్లు కురిసింది. అత్యల్పంగా అందోల్ మండలంలో 1 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జిల్లా అంతటా 2.1 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం కురిసింది. జిల్లాలోని తొమ్మిది మండలాల్లో సాధారణం కంటే అధిక వర్షం పడగా 14 మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. నాలుగు మండలాల్లో తక్కువ వర్షపాతం నమోదైంది.
సిర్గాపూర్ మండలంలో 4.6 సెంటీమీటర్లు, కల్హేర్‌లో 3.5 సెంటీమీటర్లు, నిజాంపేట, గుమ్మడిదల మండలాల్లో 3.3 సెంటీమీటర్లు, నాగల్గిద్దలో 2.7 సెంటీమీటర్లు, నారాయణఖేడ్, మనూరులో 2.4 సెంటీమీటర్లు. ఆర్సీపురంలో 2.3, అమీన్పూర్లో 2.2 సెంటీమీటర్లు, చౌటకూరులో 2.1 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని మిగతా మండలాల్లో 1.5 నుంచి 2 సెంటీమీటర్లలోపు వర్షపాతం నమోదైంది. ఈనెలలో ఇప్పటి వరకు 12.3 సెంటీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 12.2 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వర్షాలతో పుల్కల్ మండలంలోని సింగూరు ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వస్తున్నది. ఆదివారం ప్రాజెక్టులోకి 620 క్యూసెక్కుల జలాలు వచ్చాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీ కాగా ప్రస్తుతం ప్రాజెక్టులో 13.560 టీఎంసీల జలాలు ఉన్నాయి.

సిద్దిపేట కలెక్టరేట్, జూలై 21: సిద్దిపేట జిల్లాలో ఉదయం నుం చి ఎడతెరిపి లేకుండా వర్షం పడుతున్నది. దుబ్బాకలో 19.4 మి.మీటర్లు, సిద్దిపేట రూరల్‌లో 16.8మి.మీ, చిన్నకోడూరులో15.6మి.మీ, బెజ్జంకిలో18.4మి.మీ, కోహెడలో 43 మి.మీ, హుస్నాబాద్‌లో 30.2మి.మీ, అక్కన్నపేటలో 34.4 మి.మీ, నంగునూరులో 24.6మి.మీ, సిద్దిపేట అర్బన్‌లో 16మి.మీ, తొగుటలో 24.4మి.మీ, మిరుదొడ్డిలో 14.2 మి.మీ, దౌల్తాబాద్‌లో 22మి.మీ, రాయపోల్‌లో16.2మి.మీ, వర్గల్లో 11.6 మి.మీ, ములుగులో 17.6మి.మీ, మర్కూక్ లో 16.8మి.మీ, జగదేవ్‌పూర్‌లో18.4మి.మీ, గజ్వేల్‌లో 12.4మి.మీ, కొండపాకలో 25మి.మీ, కొమురవెళ్లిలో 22.2 మి.మీ, చేర్యాలలో 26.4మి.మీ, మద్దూరులో 44మి.మీ, నారాయణరావుపేటలో 14.2మి.మీ, ధూళిమిట్టలో 31.2 మి.మీ, అక్బర్పేట- భూంపల్లిలో19.8మి.మీ, కుకునూర్‌పల్లిలో 27మి.మీటర్ల వర్షపాతం నమోదు కాగా అత్యధికంగా మద్దూరు మండలంలో 44 మి.మీటర్లు, అత్యల్పంగా వర్గల్ మండలంలో 11.6మి.మీటర్ల వర్షం కురిసింది.
మెదక్, జూలై 21 (నమస్తే తెలంగాణ): మెదక్ జిల్లా వ్యాప్తం గా ముసురు వాన పడింది. శనివారం రాత్రి నుంచి ఆదివారం సాయంత్రం వరకు ముసురు వాన కురిసింది. జిల్లా వ్యాప్తంగా ఆదివారం 7.7 మి.మీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిజాంపేట మండలంలో 9.2 మి.మీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా మాసాయిపేట మండలంలో 4.1 మి. మీటర్ల వర్షపాతం నమోదైంది. నర్సాపూర్‌లో 9.1 మి.మీ, చిన్నశంకరంపేటలో 8.9 మి,మీ, నార్సింగిలో 8.3 మి,మీ, రామాయంపేటలో 8.8 మి, మీ, టేక్మాల్‌లో 8.9 మి,మీ, అల్లాదుర్గంలో 8.4 మి,మీ, పెద్దశంకరంపేటలో 8.3 మి,మీ, హవేళీఘనపూర్‌లో 8.4 మి,మీ, తూప్రాన్‌లో 8.5 మి,మీ వర్షం కురిసిందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.

మెదక్ అర్బన్, జూలై 21: భారీ వర్షాల దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్‌కుమార్‌రెడ్డి ఆదివా రం ప్రకటనలో తెలిపారు. ఏ సమయంలో అయినా ఎలాంటి ప్రమాదం తలెత్తినా క్షణాల్లో అక్కడికి చేరుకునే విధంగా పోలీ స్ యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. నిరంతరం పోలీస్ యంత్రాంగం ప్రజలకు అందుబాటులో ఉంటుందని సూచించారు. ఎవరైనా అపదలో ఉంటే వెంటనే పోలీస్ కంట్రోల్ రూమ్ సెల్: 8712657888 నెంబర్ లేదా స్థానిక పోలీస్ అధికారులకు లేదా డయల్ 100కి ఫోన్ చేసి సహాయం పొం దవచ్చన్నారు. పొలాల్లో విద్యుత్ మోటర్ల వద్ద రైతులు జాగ్రత్తగా ఉండాలని, వర్షాలు పడేటప్పుడు విద్యుత్ స్తంభాలు, వైర్లను చేతులతో తాకవద్దన్నారు. మంజీరా పరీవాహక గ్రా మాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు మత్తడి దుంకే అవకాశం ఉన్నందున వాటి వద్దకు వెళ్లవద్దన్నా రు. రెవెన్యూ, ఇరిగేషన్, పంచాయతీ, విద్యుత్, ఆర్అండ్బీ, వైద్యశాఖాధికారులతో సమన్వయం చేసుకుంటామన్నారు.