Quality Seed | మెదక్ రూరల్ అక్టోబర్ 07 : మెదక్ పట్టణ శివారు దాయరలో నాణ్యమైన విత్తనం -రైతన్నకు నేస్తం కార్యక్రమంలో భాగంగా మెదక్ జిల్లా నోడల్ అధికారి, శాస్త్రవేత్త కే రాహుల్ విశ్వకర్మ వరి పంటకి సంబంధించి MTU – 1010 రకాన్ని పరిశీలించారు.
ఈ సందర్భంగా శాస్త్రవేత్త కే రాహుల్ విశ్వకర్మ రైతులతో మాట్లాడుతూ..ఈ నాణ్యమైన విత్తనంతో పంటలు సమృద్ధిగా పండించి తద్వారా దేశ సమగ్ర అభివృద్ధికి తోడ్పడాలన్నారు. మహత్తర లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సంయుక్తంగా ప్రతి మండలంలో ప్రతి రెవెన్యూ గ్రామానికి విత్తన కిట్లు అందజేయడం జరిగిందన్నారు.
ఈ నాణ్యమైన విత్తనాలను రైతులు తమ పొలాల్లో పండించి తద్వారా పండిన విత్తనాల్ని ఇతర రైతులకు చేరవేసేలా చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇది విత్తన లభ్యతను పెంచడమే కాకుండా నాణ్యమైన విత్తనంపై అవగాహన కల్పించుటకు దోహదపడుతుందని అన్నారు. అలాగే రైతులకు అవసరమైన సూచనలు , సమస్యలకు సత్వరమే పరిష్కారం లభిస్తుందని తెలిపారు.
వరి పంటలో సమగ్ర చీడపీడల యాజమాన్యం, ఈ మాసంలో చేపట్టాల్సిన వ్యవసాయ పనుల గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ విస్తరణ అధికారి రాజశేఖర్, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం యంగ్ ప్రొఫెషనల్ – 1 ఎస్. శ్రీకాంత్, రైతులు గందె రాములు, శ్రీకాంత్, షేక్ మక్తార్ తదితరులు పాల్గొన్నారు.
Kumram Bheem | కుమ్రం భీం ఆశయ సాధనకు కృషి చేయాలి : బానోత్ గజానంద్
Chief Justice BR Gavai | చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్‌పై దాడి హేయమైన చర్య : గుణిగంటి మోహన్
Metpalli | సీజేఐపై దాడికి నిరసనగా విధుల బహిష్కరణ