కోహీర్, ఆగస్టు 20: పంజాబ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ బాలముఖుంద్ శర్మ, సభ్యులు బుధవారం సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో పర్యటించారు. తొలుత దిగ్వాల్ జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించారు. ఈ సందర్భంగా పంజాబ్ ఫుడ్ కమిషన్ చైర్మన్ బాల్ముకుంద్ శర్మ మాట్లాడుతూ.. 2013లో కేంద్ర ప్రభుత్వం ఆహార భద్రత చట్టం తీసుకు వచ్చిందన్నారు.
విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తేనే బంగారు భారతం సాధ్యమన్నారు. అనంతరం అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి బాలింతలు, తల్లులు, చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి తెలుసుకున్నారు. అక్కడి నుంచి రేషన్ దుకాణాన్ని పరిశీలించి సరుకుల పంపిణీ పరిశీలించారు. ఆయన వెంట తెలంగాణ ఫుడ్ కమిషన్ చైర్మన్ ఆనంద్, పంజాబ్ సభ్యులు విజయ్దత్, చేతన్ప్రకాశ్ దలివాల్, జశ్వీర్సింగ్, జ్యోతి, వెంకటేశ్వర్లు, ఎంఈవో జాకీర్ హుస్సేన్ ఉన్నారు.