పాపన్నపేట : పాపన్నపేట మండల పరిధిలోని కుర్తివాడ గ్రామానికి చెందిన అనాధ పిల్లలకు ( Orphaned children) పీఆర్టీయూ (PRTU ) అండగా నిలిచింది. తల్లిదండ్రులు లేని గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలకు పాపన్నపేట మండల పీఆర్టీయూ శాఖ రూ. 26వేలను ఆర్థిక సాయం ( Financial assistance ) శనివారం అందజేసింది. కుర్తివాడ గ్రామానికి చెందిన లావణ్య, అనురాధ , నవీన్ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.
వీరి ముగ్గురికి తల్లిదండ్రులు లేని విషయం తెలుసుకున్న ఆ గ్రామానికి చెందిన సీఆర్పీ దేవయ్య పీఆర్టీయూ నాయకులకు వివరించారు. దీంతో స్పందించిన పీఆర్టీయూ నాయకులు రూ. 26 వేల ను చందాల రూపంలో వసూలు చేసి శనివారం అనాధ పిల్లలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రాజు,సురేష్ , జిల్లా కార్యదర్శి స్వామి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు అంజనాచారి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీందర్‌రెడ్డి,రాష్ట్ర కార్యదర్శి జనార్దన్, మండల అసోసియేట్ అధ్యక్షుడు సంతోష్‌కుమార్ , కార్యదర్శి నాగేశ్వర్, జిల్లా బాధ్యులు సాయిలు, మధుసూదన్, సీఆర్పీ దేవయ్య తదితరులు పాల్గొన్నారు.