పాపన్నపేట, జులై 24 : రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించాలని, పెండింగ్ లో ఉన్న డీఎలను విడుదల చేయాలని పీఆర్టీయూ నాయకులు డిమాండ్ చేశారు. మేరకు మెదక్ జిల్లా పాపన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం సభ్యత్వ నమోదు అనంతరం విలేకరులతో మండల అధ్యక్ష కార్యదర్శులు రాజు, సురేష్ మాట్లాడారు. దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న ఉపాధ్యాయులకు చెందిన బకాయిలన్నీ చెల్లించాలన్నారు.
సిపిఎస్ ను రద్దు చేసి వెంటనే ఓపీఎస్ ను ప్రకటించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీనియర్ బాధ్యులు వెంకట రామ్ రెడ్డి, అంజనా చారి, భవానీ ప్రసాద్, కృష్ణ కాంత్, సతీష్ గౌడ్, నింగప్ప జనార్ధన్, సిద్ధిరాములు, ప్రవీణ్, సంతోష్ ,రియాజ్, వెంకటేశం, దుర్గయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయులు మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.