మెదక్, ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): తెలంగాణకు వివిధ సందర్భాల్లో చేసిన వాగ్ధానాలు, రాష్ట్ర విభజన చట్టం ప్రకారం దకాల్సిన హకులు, వాటాలను కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తూ, వివక్షను ప్రదర్శిస్తున్నదని సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి ఎ.మల్లేశం విమర్శించారు. శనివారం తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నరేంద్ర మోదీ పర్యటనకు వ్యతిరేకంగా నిరసన తెలుపుతూ మెదక్ జిల్లా కేంద్రంలో మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి లాంటి సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించడానికి పూనుకుంటున్నదని, తాజాగా మరోసారి బొగ్గు గనుల వేలానికి కేంద్రం నిర్ణయం తీసుకున్నదన్నారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటిని ఒకొకటిగా ప్రైవేట్ కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు కుట్ర పన్నుతున్నదన్నారు. బయ్యారం ఉకు, గిరిజన, హర్టికల్చర్ యూనివర్సిటీలు, ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రం, ఖాజీపేట రైల్వేకోచ్ ప్యాక్టరీ ఊసే ఎత్తడంలేదని ఆరోపించారు. యూపీఏ హయాంలో మంజూరైన ఐటీఐఆర్‌ను రద్దు చేసిందన్నారు. కృష్ణా నదీ జలాల పంపిణీ పంచాయితీపై రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏర్పాటు చేసి, రెండు నదులను తన పరిధిలోకి లాకున్నదన్నారు. గిరిజన, వెనకబడిన ప్రాంతాల అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందన్నారు. పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బస్వరాజ్, సంతోశ్, జిల్లా నాయకులు ప్రవీణ్, జగన్, అజయ్, లచ్చాగౌడ్, షౌకత్ అలీ పాల్గొన్నారు.
నారాయణఖేడ్‌లో
నారాయణఖేడ్, ఏప్రిల్ 8: తెలంగాణ రాష్ర్టానికి ఇచ్చిన హామీలు మరిచిన ప్రధాని నరేంద్రమోదీకి రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదని సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అతిమేల మాణిక్ ప్రశ్నించారు. శనివారం మోదీ రాష్ట్ర పర్యటనను వ్యతిరేకిస్తూ నారాయణఖేడ్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ర్టాల హక్కులను తమ చేతుల్లోకి తీసుకోవడంతో పాటు విభజన చట్టంలోని హామీలను పట్టించుకోవడం లేదన్నారు. కృష్ణ నీటి బోర్డును కేంద్ర ప్రభు త్వం తన చెప్పు చేతుల్లో పెట్టుకున్నదని, రెండు రాష్ర్టాల నీటి వాటా ఇప్పటికీ తేలలేదన్నారు. తెలంగాణను నష్టపరిచే చర్యలకు పాల్పడుతున్నారన్నారు. కార్యక్రమంలో ఏరియా కమిటీ కార్యదర్శి చిరంజీవి, సభ్యులు నర్సింహులు, గణపతి, ప్రవీణ్, ప్రశాంత్ పాల్గొన్నారు.
సంగారెడ్డిలో మోదీ గో బ్యాక్
సంగారెడ్డి, ఏప్రిల్ 8: ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనకు వ్యతిరేకిస్తూ మోదీ గో బ్యాక్ అంటూ సీపీఎం నాయకులు పట్టణంలోని కొత్త బస్టాండ్ దగ్గర శనివారం నిరసన వ్యక్తిం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు మల్లేశం మాట్లాడుతూ మోదీ ఎనిమిదేండ్లలో తెలంగాణకు మొండి చేయి చూపించారని, ఇచ్చిన హామీలు మర్చి తెలంగాణకు రావడం సిగ్గుచేటన్నారు.
తెలంగాణకు రైల్వే కోచ్‌ఫ్యాక్టరీ ఇస్తామని, ఇప్పటికీ నిధులు కేటాయించలేదన్నారు. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి నిధులు కేటాయించలేదన్నారు. ఎన్టీపీసీ విద్యుత్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ఉలుకుపలుకు లేదన్నారు. సింగరేణిని ప్రైవేటీకరణ చేయమని చెప్పి, బొగ్గు గనులకు టెండర్లు పిలవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కమిటి సభ్యుడు యాదవరెడ్డి, నాయకులు బాలరాజు, సాయిలు, మహేశ్, నరసింహరెడ్డి తదితరులు పాల్గొన్నారు.