సిద్దిపేట అర్బన్, జూన్ 5 : పర్యావరణాన్ని రక్షించడం అందరి బాధ్యత అని అదనపు కలెక్టర్ గరీమా అగర్వాల్ అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ క్యాంపు కార్యాలయ ఆవరణలోని మైదానంలో అదనపు కలెక్టర్ తల్లి కిరణ్ అగర్వాల్‌తో కలిసి మొక్కను నాటారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. పర్యావరణ ప్రేమికులు ప్రతి ఒక్కరూ మొక్కను నాటి పర్యావరణాన్ని రక్షించుకుందామని పిలుపునిచ్చారు.
మద్దూరు(ధూళిమిట్ట), జూన్ 6 : మద్దూ రు, ధూళిమిట్ట మండల కేంద్రాలతో పాటు మండలంలోని రేబర్తిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మద్దూరు, ధూళిమిట్ట, రేబర్తి గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు వెంకటేశ్వర్లు, రాజు, మాధవ్‌జాదవ్ ఆధ్వర్యంలో గ్రామస్తులు మొక్కలు నాటారు. ప్లాస్టిక్ వస్తువులు వాడటం వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎంపీటీసీ బొప్పె కనకమ్మ, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.
గజ్వేల్, జూన్ 5: అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవంలో భాగంగా గజ్వేల్ బాలిక వసతి గృహం ఆవరణలో విద్యార్థులు మొక్క లు నాటారు. ఈ సందర్భంగా వసతి గృహం వార్డెన్ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి విద్యార్థి ఒక్కో మొక్కను పెంచితే భవిష్యత్ తరాలకు ఉపయోగకంగా ఉంటుందన్నారు. కార్యక్రమంలో వి ద్యార్థులు, ఆయాలు పాల్గొన్నారు.
సిద్దిపేట, జూన్ 5: పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒకరూ నడుం బిగించాలని సిద్దిపేట మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి అన్నారు. నెహ్రూ యువ కేంద్రం, మున్సిపాలిటీ, క్రాంతి హైసూల్, డెంటల్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సిద్దిపేటలో పర్యావరణ పరిరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. ముస్తాబాద్ రస్తా, విక్టరీ రస్తా, పాత బస్టాండ్ వద్ద ఫ్లాష్ మాబ్ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అకాడమిక్ మెయింటెనెన్స్ జిల్లా అధికారి భాసర్, క్రాంతి హై సూల్ డైరెక్టర్ భగవాన్‌రెడ్డితో కలిసి ఆమె మాట్లాడారు. పచ్చదనాన్ని పెంపొందించి, ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ప్రజలకు సూ చించారు.
కొమురవెల్లి, జూన్ 5 : మండలం వ్యా ప్తంగా జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆయా గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. మండలంలోని గురువన్నపేటలో ఎంపీడీవో కుమారస్వామి మొక్కలు నాటే కార్యక్రమాన్ని పరిశీలించారు. కార్యక్రమం లో పంచాయతీ కార్యదర్శి స్వర్గం సతీశ్, ఫీల్డ్ అసిస్టెంట్ పుట్ట కనకయ్య, ఉపాధిహామీ కూలీ లు పాల్గొన్నారు.
ములుగు, జూన్ 5 : ములుగులోని (ఎఫ్సీఆర్ఐ) ఫారెస్ట్ కాలేజ్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని జరుపుకొన్నారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలో విద్యార్థులు, అధ్యాపక బృం దం మొక్కలు నాటారు. అనంతరం మొక్కల పెంపకం, అడవుల సంరక్షణపై విద్యార్థులకు తెలియజేశారు. కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
కొండపాక(కుకునూరుపల్లి), జూన్ 5 : జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండపాకలో ఎంపీపీ మంచాల అనసూయ కనకరాములు మొక్కలు నాటా రు.కార్యక్రమంలో ఎంపీటీసీ ఆరుట్ల లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు.
గజ్వేల్, జూన్ 5: ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ దవాఖాన ఆవరణలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ మాట్లాడుతూ ప్లాస్టిక్‌ను నిషేధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతోపాటు దవాఖానకు వచ్చే వారికి సిబ్బంది అవగాహన కల్పించాలన్నారు. మొక్కలు పెంచడంతోనే పర్యావరణంలో మార్పులు వస్తాయన్నారు. సిబ్బం ది నర్సింహులు, సురేందర్ పాల్గొన్నారు.
మిరుదొడ్డి, జూన్ 5: మండలంలోని అం దె గ్రామంలో వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లు, ఆశ వర్కర్ల ఆధ్వర్యంలో జడ్పీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, అంగన్ వాడీ టీచర్లు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
సిద్దిపేట టౌన్,జూన్ 5 : పర్యావరణ పరిరక్షణకు అందరూ పాటుపడాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి రమాదేవి పిలుపునిచ్చారు.జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని కోర్టు ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో జడ్జిలు, న్యాయవాదులతో కలిసి మొక్కలు నాటారు.అనంతరం పర్యావరణ దినోత్సవంలో భాగంగా ప్రకృతిని ప్రేమించండి పర్యావరణాన్ని రక్షించండి అని పిలుపునిస్తూ ర్యాలీని విక్టరీ చౌరస్తా వరకు నిర్వహించారు. జడ్జిలు స్వాతిరెడ్డి, మిలింద్ కాంబ్లే, చందన, శ్రావణి, న్యాయవాదులు జనార్దన్‌రెడ్డి, బాబురావు, ఆత్మరాములు, శ్రీశైలం, వెంకటేశ్వర్రావు, ప్రకాశ్, సత్యనారాయణ పాల్గొన్నారు.