CP Rashmi Perumal | ప్రజలకు సత్వర, పారదర్శక పోలీస్ సేవలు అందించాలి : పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్
CP Rashmi Perumal | సిద్దిపేట జిల్లా రాయపోల్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
రాయపోల్ : సిద్దిపేట జిల్లా రాయపోల్( Rayapol ) పోలీస్ స్టేషన్ను శుక్రవారం పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్( CP Rashmi Perumal ) ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్లోని వివిధ రికార్డులు, కేసుల నిర్వహణ, సిబ్బంది హాజరు నమోదు, ఆయుధాల భద్రత, మాల్ఖానా నిర్వహణ తదితర అంశాలను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పెండింగ్ కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు.
ప్రజలకు సత్వర, పారదర్శక పోలీస్ సేవలు అందించాలని, ఫిర్యాదుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించరాదని ఆదేశించారు. స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందితో సమావేశమై వారి పనితీరు, సమస్యలపై ఆరా తీశారు. శిధిలావస్థ భవనంలో ఉన్న పోలీస్ స్టేషన్ కొత్త భవనంలోకి మార్చాలని ఆదేశించారు. పోలీస్ స్టేషన్ కొత్త భవన నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని ఆమె పరిశీలించారు. ఆమె వెంట గజ్వేల్ ఏసీపీ నర్సింలు, తొగుట సీఐ షేక్ లతీఫ్, రాయపోల్ ఎస్సై మానస, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

