మెదక్ మున్సిపాలిటీ, డిసెంబర్ 10 : 2022-23 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాల్లో పదో తరగతి వార్షిక ఫలితాల్లో వందశాతం సాధించడానికి రాష్ట్ర విద్యాశాఖ కృషి చేస్తోంది. వంద శాతం ఉత్తీర్ణతే లక్ష్యంగా సుమారు 85 రోజు లపాటు ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. నవంబర్ 14 నుంచి ఫిబ్రవరి 26 వరకు విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు సబ్జెక్టు ల వారీగా నైపుణ్యాన్ని పెంచి ఉత్తీర్ణత శాతాన్ని పెంచే లక్ష్యం తో ముందుకెళ్తున్నారు. ఉత్తమ ఫలితాలతోపాటు అత్యధిక మార్కులు సాధించేలా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరీక్షలకు సన్నద్ధ్దం చేస్తున్నారు. ఇప్పటికే 60 శాతానికి పైగా సిలబస్ పూర్తి కాగా.. డిసెంబర్ నెలాఖరు వరకు వంద శాతం సిలబస్ పూర్తయ్యేలా ముందుకు సాగుతున్నారు. గత విద్యా సంవత్సరంలో వెల్లడించిన పదో తరగతి ఫలితాల్లో మెదక్ జిల్లా రాష్ట్రంలో పదో స్థానంలో ఉండగా, ఈసారి ఉత్తీర్ణత శాతం మరింత పెరిగిలా జిల్లా విద్యాశాఖ కృషి చేస్తోంది.
ఉదయం, సాయంత్ర వేళల్లో ప్రత్యేక తరగతులు..
ప్రభుత్వ పాఠశాలల్లో నవంబర్ 9 నుంచి ప్రత్యేక తరగతుల కొనసాగుతున్నాయి. ఉదయం 8:30 నుంచి 9:30 వరకు, సాయంత్రం 4:45 నుంచి 5:45 గంటల వరకు ప్రతిరోజు సబ్జెక్టు వారీగా ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నా రు. ప్రభుత్వ పాఠశాలల్లో వంద శాతం ఫలితాలు సాధించాలనే లక్ష్యంతో విద్యార్థులకు ప్రాజెక్ట్ వర్స్, రోజూ స్లిప్ టెస్టు నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరిలో ఫ్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నారు. డీఈవో ఆదేశాలతో ప్రతి ఆదివారం ఉదయం 9 నుంచి 11 వరకు, 11 నుంచి ఒంటి గంట వరకు రెండు సబ్జెక్ట్‌ల ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తున్నారు. మెదక్ జిల్లాలో ప్రభుత్వ, పైవేట్ విద్యాసంస్థలకు సంబంధించి 10,570 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
పాపన్నపేటలో ‘పది’కి పది లక్ష్యం
కొనసాగుతున్న ప్రత్యేక తరగతులు
పాపన్నపేట, డిసెంబర్ 10 : మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి విద్యార్థులు 10 జీపీఏకి 10 శాతం జీపీఏ సాధించేలా ఉపాధ్యాయులు ధృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నారు. దీనికి అనుగుణంగా విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పాపన్నపేట మండలంలో కేజీబీవీ పాఠశాలను కలుపుకొని మొత్తం 11 ఉన్నత పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 570 మంది విద్యార్థులు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. వీరికి ప్రతి రోజు ఉదయం 8:45 నుంచి 9:30 వరకు, సాయంత్రం 4:45 నుంచి 5:30 వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. ప్రతి రెండో శనివారం, ఆదివారం వారాంతపు పరీక్షలు నిర్వహించి విద్యార్థులు సాధించిన ప్రగతిని గుర్తిస్తున్నారు. వెనకబడిన విద్యార్థులను ప్రో త్సహించి పరీక్షల నాటికి తోటి విద్యార్థులతో సమాన మా ర్కులు సాధించేలా ప్రోత్సహిస్తున్నారు. ఉదయం ఒక సబ్జెక్ట్, సాయంత్రం మరో సబ్జెక్టుపై ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఫలితాలతోపాటు అధిక శాతం మంది 10/10జీపీఏ సాధించడానికి ఉపాధ్యాయులు శాయశక్తుల కృషి చేస్తున్నారు.
వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
సబ్జెక్టుల వారీగా వెనుకబడిన వి ద్యార్థులను గుర్తించి, వారిపై ప్రత్యేక దృష్టి సారించాం. విద్యార్థుల్లో అనుమానాలను నివృత్తి చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. సిలబస్ ప్రకా రం బోధన చేపట్టి ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. రాష్ట్ర విద్యాశాఖ నవంబర్ 14 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహించాలని ఆదేశాలిచ్చింది. ఈ సారి వంద శాతం ఫలితాలు సాధించే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం.
– రమేశ్‌కుమార్, జిల్లా విద్యాధికారి
వంద శాతం ఉత్తీర్ణత సాధిస్తాం
పదో తరగతి పరీక్షల్లో 100 శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్ర యత్నిస్తున్నాం. ఇందుకోసం ఉపా ధ్యాయులు శాయశక్తుల కృషి చేస్తున్నారు. కొన్ని సంవత్సరాలుగా పాపన్నపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 100 శాతం ఫలితాలు సాధించి జిల్లాలోనే మంచి పేరు సాధించింది. ఈ సారి కూడా 100 శాతం ఫలితాలు సాధిస్తాం.
– హరిసింగ్, ప్రధానోపాధ్యాయుడు, పాపన్నపేట.
ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ
పాపన్నపేట పాఠశాలలో పదో తరగతి విద్యార్థులందరికీ 10 జీపీ ఏకి 10 శాతం జీపీఏ సాధించేలా ప్రత్యేక చర్యలు తీసుకున్నాం. ప్రతి రోజూ ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాం. చదువులో ముందున్న విద్యార్థులతో పాటు వెనుకబడిన వారిపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించి విద్యాబోధన సాగిస్తున్నాం. గతంలో తమ పాఠశాల నుంచి పెద్ద సంఖ్యలో విద్యార్థులు 10/10 సాధించి త్రిపుల్‌ఐటీలో సీట్లు సాధించారు. ఈ సారి కూడా అధిక శాతం మంది 10 జీపీఏ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం.
– యశోద, సాంఘికశాస్త్రం ఉపాధ్యాయురాలు