నర్సాపూర్, జూన్ 22: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి సూచించారు. సోమవారం మెదక్ జిల్లా నర్సాపూర్ మండల పరిధిలోని బ్రాహ్మణపల్లి, రెడ్డిపల్లి, నాగులపల్లి, ఆద్మాపూర్,చిప్పల్తూర్తి గ్రామాల్లో ముంజూరైన ప్రీ ప్రైమరీ స్కూళ్లను ఆమె ప్రారంభించారు. రెడ్డిపల్లి, చిప్పల్తూర్తి పాఠశాలలో మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. బిల్లులు సక్రమంగా వస్తున్నాయా లేదా అనే విషయాలను అడిగి తెలుసుకున్నారు. గ్యాస్లేక వంట చేసేందుకు ఇబ్బంది పడుతున్నామని రెడ్డిపల్లి మధ్యాహ్న భోజన కార్మికులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. నాగులపల్లి,ఆద్మాపూర్లో పూలతో విద్యార్థులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం కొత్తగా ఈ ఏడాది ప్రీ ప్రైమరీ స్కూళ్లు ప్రారంభించిందన్నారు. నాలుగేండ్లు పైబడిన విద్యార్థుల కోసం ఇలాంటి పాఠశాలలు ఏర్పాటు చేసిందన్నారు. పాఠశాలలు ప్రారంభించడం ముఖ్యం కాదని దానికి అనుగుణంగా ప్రభుత్వం సదుపాయాలు కల్పించాలని కోరారు. క్లస్రూమ్, బెంచీలు, పుస్తకాలు అందించాలని కోరారు. ప్రైవేట్ పాఠశాలలకంటే శిక్షణ పొందిన ఉపాధ్యాయులు ప్రభుత్వ పాఠశాలల్లో ఉన్నారన్నారు. అన్ని వసతులు కల్పిస్తే ఉత్తమ ఫలితాలు వస్తాయన్నారు. ఎంఈవో తారాసింగ్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు చంద్రశేఖర్, పట్టణ అధ్యక్షుడు భిక్షపతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు లక్ష్మీనర్సయ్య, ఆంజనేయులు, శ్రీనివాస్‌రెడ్డి, రవి,సేనాధిపతి, జీవన్‌రెడ్డి, షేక్‌హుస్సేన్, ప్రసాద్, సురేశ్‌గౌడ్, విఠల్, సుదీప్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.