రామాయంపేట, ఫిబ్రవరి 20: విద్యుత్ శాఖకు చెందిన ఆర్టీజన్ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు.గురువారం తెల్లవారుజామునే విద్యుత్ సబ్స్టేషన్లలో పనిచేసే సిబ్బంది హైదరాబాద్ వెళ్లేందుకు సమాయత్తం అవుతుండగానే పోలీసులు ఆర్టీజన్ కార్మికులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. ప్రభుత్వం తమ ఉద్యోగాలనును రెగులరైజ్ చేయకుండా తమ సమస్యలను గాలి కొదిలేసిందని ఆర్టీజన్ కార్మికులు ఆరోపిస్తున్నారు.
తమ సర్వీసులను రెగ్యులైజేషన్ చేసేవరకు నిరసనలు చేపడతామని ప్రభుత్వాన్ని ఆర్టీజన్ కార్మికులు హెచ్చరించారు. గురువారం విద్యుత్ సౌధ ముట్టడించాలని విద్యుత్ శాఖ ఆర్టీజన్ ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు బయలు దేరుతున్న తమను పోలీసులు అర్ధంతరంగా అరెస్టులకు పాల్పడడం తగదన్నారు. ఈ అక్రమ అరెస్టులను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు.