మెదక్, మార్చి 31 (నమస్తే తెలంగాణ) : పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైనందున, ఎన్నికల విధుల్లో జిల్లా అధికారులు, సిబ్బంది నిమగ్నమై ఉన్నందున ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు మెదక్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని తాతాలికంగా వాయిదా వేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని ప్రజలు గమనించాలని ఆయన కోరారు.