సంగారెడ్డి కలెక్టరేట్, ఆగస్టు 17: చారిటీకి రక్షణ కల్పించాలని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కోరారు. శనివారం సంగారెడ్డి కలెక్టరేట్‌కు వచ్చిన ఆయన కలెక్టర్‌ను కలిసి సదాశివపేటలో ఉన్న తన చారిటీకి రక్షణ కల్పించాలని వినతిపత్రం అందజేశారు. అనంతరం కలెక్టరేట్ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడారు. సదాశివపేటలో మొత్తం 1200 ఎకరాల చారిటీ భూమి ఉన్నదని, అందులో దాదాపు 50 ఎకరాల భూమిని కొందరూ కబ్జా చేశారని తెలిసిందన్నారు. ఈ విషయంపై ఇప్పటికే జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినా ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదన్నారు.
ఇప్పటికైనా అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో కోర్టును ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. నేను బటన్ నొక్కితే పైకి పోవాల్సిందే అంటూ శాపనార్థాలు పెట్టారు. దేవుడి మా న్యాలపై ఎవరు కన్నేసినా వారు భూమిపై బతకరని పేర్కొన్నారు. ఇం దుకు నిదర్శనం తన అన్నతో సహా మొత్తం ఏడుగురు పైకిపోయారని వివరించారు. తన చారిటీ భూముల డబుల్ రిజిస్ట్రేషన్ చేసిన రిజిస్టర్, అందుకు సహకరించిన తహసీల్దార్లపై చర్యలు తీసుకునేందుకు సమ యం ఇచ్చానని, ఆ సమయంలోగా సంబంధిత అధికారులందరిపై చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విదేశాల నుంచి ఖాళీ చేతులతో తిరిగి వచ్చారని చెప్పారు.
తనతో అమెరికా వస్తే పెట్టుబడులు తెస్తానని, లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తానని స్పష్టం చేశారు. ప్రపంచంలోని మొదటి ముగ్గురు ధనవంతులతో కల్పిస్తానని, తద్వారా 100 కంపెనీలు తీసుకొచ్చి లక్ష ఉద్యోగాలు ఇప్పిస్తానని పేర్కొన్నారు. అందులో 10 కంపెనీలను సంగారెడ్డిలో ఏర్పాటు చేయిస్తానన్నారు. సంగారెడ్డిలో నిరుద్యోగి లేకుండా చేస్తానని చెప్పారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలపై సుప్రీం కోర్టులో కేసు వేస్తానని పేర్కొన్నారు. ఒక పార్టీపై గెలిచి మరో పార్టీలోకి వెళ్లడం తప్పు అన్నారు.