సదాశివపేట, సెప్టెంబర్ 14: సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండల ప్రజాపరిషత్ భవన నిర్మాణ పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఎంపీడీవో భవనం పూర్తి కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్లర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ఏడాదిగా నిర్మాణ పనులు సాగుతూనే ఉన్నాయి.
2023 ఏప్రి ల్ 6న అప్పటి వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు, అప్పటి హ్యాండ్లూమ్ కార్పొరేషన్ చైర్మన్, ప్రస్తుత ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ రూ. కోటి నిధులతో ఎంపీడీవో భవన నిర్మా ణ పనులకు శంకుస్థాపన చేశారు. ఎంపీడీవో కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరడంతో బీఆర్ఎస్ సర్కార్ నిధులు మంజూరు చేసిం ది. దీంతో శిథిలావస్థకు చేరిన పురాతన ఎం పీడీవో భవనాన్ని పూర్తిగా డిస్మెంటల్ చేసి నూతన భవనాన్ని నిర్మిస్తున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పనులు కొనసాగుతూ నే ఉన్నాయి.
ప్రస్తుతం పిల్లర్లు వేసి స్లాబు వేశారు. ఏడాదిగా నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.ప్రస్తుతం రెండు చిన్న గదులలో ఎం పీడీవో కార్యాలయం కొనసాగుతున్నది. కార్యాలయం చిన్నదిగా ఉండడంతో కూర్చోవడానికి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు, ఆఫీస్‌కు వచ్చే ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.