చేగుంట, సెప్టెంబర్ 9 : ప్రజాకవి కాళోజీ నారాయణ సేవలు చిరస్మరణీయమని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. చేగుంటలోని ఎమ్మార్సీ కార్యాలయ ఆవరణలో ఉపాధ్యాయ సంఘాల నా యకులు శనివారం కాళోజీ చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు మాట్లాడుతూ నిజాం పాలనకు వ్యతిరేకంగా కాళోజీ తన రచనలతో ప్రజలను చైతన్యపరి చారని, ఈ క్రమంలోఅనేకసార్లు జైలుకు వెళ్లారని వివరించారు.
కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా ప్రకటించ డం సముచితంగా ఉందన్నారు. కార్యక్రమంలో ఉపాధ్యాయు లు చల్లా లక్ష్మణ్, సురేందర్, ఆంజనేయులు, వెంకటేశ్, బాల్శెట్టి, రేఖ, సుమతి, మధుసూదన్‌రెడ్డి, రమేశ్ న్నారు.