చేగుంట, మార్చి 1: ‘తెల్లారిందా కరెంట్ కట్’ అని కర్నాల్పల్లిలో 15 రోజుల నుంచి ఎదురవుతున్న కరెంట్ సమస్యపై శనివారం ‘నమస్తే తెలంగాణ’లో వచ్చిన కథనానికి విద్యుత్ శాఖ అధికారులు స్పందించారు. ట్రాన్స్కో జోన్ ఛీప్ ఇంజినీర్ బాలస్వామి, ఎస్ఈ శంకర్, డీఈ గరుత్మంత్రాజ్, ఏడీఏ అడివయ్య, ఏఈ భరత్ శనివారం కర్నాల్పల్లిలో పర్యటించారు.
ప్రతిరోజు గ్రామంలో తలెత్తుతున్న విద్యుత్ సమస్య గురించి గ్రామస్తులతో మాట్లాడి తెలుసుకున్నారు. గ్రామంలో ఉదయం విద్యుత్ వినియోగం అధికంగా ఉండడంతో సమస్య తలెత్తున్నట్లు గుర్తించారు. అదనంగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్తో పాటు కొత్తగా విద్యుత్ స్తంభాలు, వైర్లను బిగింపజేసి సమస్య పరిష్కరించారు. సమస్యను విద్యుత్ అధికారుల దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషిచేసిన ‘నమస్తే తెలంగాణ’కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.