Potholes | మెదక్ రూరల్ మే, 28 : అది మెయిన్ రోడ్డు.. మెదక్ జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కార్యాలయం, పీఏసీఎస్ కార్యాలయానికి వెళ్లే ప్రధాన మార్గం.. రోడ్డు గుంతలమయం కావడంతో వర్షానికి వచ్చిన నీరు చేరింది. దీంతో నిత్యం ఎంతోమంది ఫర్టిలైజర్ షాపులకు వెళ్ళే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. రోడ్డు గుంతలమయం కావడంతో అందులో వర్షపు నీరు చేరి రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతుందని రైతులు, ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
వెంటనే సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరమత్తులు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా వ్యవసాయం డివిజన్ కార్యాలయం, ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం కార్యాలయంలో ఎరువులు, విత్తనాల కోసం వెళ్లే రైతులకు కూడా ఇది పెద్ద సమస్యగా మారిందని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలంటున్నారు.
KTR | మేడిగడ్డ బ్యారేజీపై ఎన్డీఎస్ఏ నివేదిక బూటకమని తేలిపోయింది : కేటీఆర్
Bad Breath | నోటి దుర్వాసనతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ చిట్కాలను పాటించండి..!
Jio Electric Scooter | మార్కెట్లో జియో ఎలక్ట్రిక్ స్కూటర్.. ఇవీ ఆ స్కూటర్ ప్రత్యేకతలు