న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: భారతీయ కృత్రిమ మేధ (ఏఐ) స్టార్టప్ ‘సర్వమ్ ఏఐ’ దేశంలోనే తొలి ఏఐ టెక్నాలజీ కండ్ల జోడును విడుదల చేసింది. ఢిల్లీలో ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్’ను ప్రారంభించిన ప్రధాని మోదీ, అత్యంత అధునాతన ఏఐ కండ్ల జోడు ‘సర్వం కేజ్’ను ధరించినట్టు సదరు కంపెనీ చీఫ్ ప్రత్యూశ్ కుమార్ మీడియాకు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఒక టీజర్‌ను ‘ఎక్స్’లో విడుదల చేశారు.
చాట్‌జీపీటీ, గూగుల్ జెమినైలకు దీటుగా ఏఐ హార్డ్‌వేర్ ఉత్పత్తులను తీసుకొస్తున్నట్టు ‘సర్వం ఏఐ’ కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. దాంట్లో భాగంగా తయారుచేసిన ఏఐ కండ్ల జోడును ఈ ఏడాది మేలో మార్కెట్లోకి విడుదల చేయబోతున్నది. గత ఏడాది మెటా కంపెనీ తీసుకొచ్చిన ఏఐ కళ్లజోడు ‘మెటా రేబాన్స్’ 70 లక్షలకుపైగా అమ్ముడుపోయాయి. యాపిల్ కూడా ఈ తరహా స్మార్ట్గ్లాసెస్ను తీసుకురాబోతున్నది.