బీఆర్ఎస్ నేతలపై రాళ్ల దాడి బాధాకరం.. దళిత మహిళా కౌన్సిలర్‌తో అసభ్యంగా ప్రవర్తించడం దారుణం: కేటీఆర్
బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తోపాటు పార్టీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు జరిపిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ చేసిన రాళ్ల దాడి చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
- బాల్క సుమన్, కోవ లక్ష్మిపై కేసులు పెడ్తామని బెదిరిస్తే సహించేది లేదు
హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌తోపాటు పార్టీ నాయకులపై కాంగ్రెస్ గూండాలు జరిపిన రాళ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు తెలిపారు. బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ చేసిన రాళ్ల దాడి చాలా బాధాకరమని పేర్కొన్నారు. ఈ మేరకు మంగళవారం ఎక్స్‌లో ట్వీట్ చేశారు. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకున్నా చైర్మన్ ఎన్నికల్లో కౌన్సిలర్లు పాల్గొనకుండా అడ్డుకొని వాయిదా వేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. కొందరు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా మారి, అన్యాయాన్ని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపైనే లాఠీచార్జ్‌కు దిగడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని ఆగ్రహం వ్యక్తంచేశారు.
న్యాయం కోసం నిరసనకు దిగిన ఎమ్మెల్యే కోవ లక్ష్మి, మాజీ ఎమ్మెల్యే బాల సుమన్పైనే కేసులు బనాయిస్తామని బెదిరించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదని హెచ్చరించారు. జనగామలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ చేతి పైకిఎత్తిన దళిత మహిళా కౌన్సిలర్ పట్ల.. కాంగ్రెస్ కౌన్సిలర్లు అసభ్యంగా ప్రవర్తించడం చాలా దారుణమని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల నాటి నుంచి మున్సిపల్ ఎన్నికల దాకా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి డైరెక్షన్లో, అడుగడుగునా అరాచక పర్వాన్ని కొనసాగిస్తున్న అధికార కాంగ్రెస్ పార్టీకి ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
Telangana | తెలంగాణలో కొత్త జిల్లాలకు పదేళ్లు.. వికేంద్రీకరణ ప్రయాణంపై తొలి సీఎస్ రాజీవ్‌శర్మ కీలక విశ్లేషణ
Aadi Sai Kumar | ఆది సాయికుమార్‌పై దారుణమైన ట్రోలింగ్.. నాని, రవితేజల పేర్లు ప్రస్తావిస్తూ హీరో స్ట్రాంగ్ కౌంటర్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

