హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజీ (ఆర్ఐఎంసీ) ప్రవేశ పరీక్ష నోటిఫికేషన్ మంగళవారం విడుదలైంది. 8వ తరగతిలో అడ్మిషన్ల కోసం జూన్ 7న రాత పరీక్ష నిర్వహించనున్నట్టు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ్ ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుల స్వీకరణ మంగళవారం (ఫిబ్రవరి 17) నుంచే ప్రారంభమైనట్టు వెల్లడించారు. వివరాల కోసం scert.telangana.gov. in వెబ్సైట్, 85208 66771 హెల్ప్‌లైన్ నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.