రైతులను ఆదుకుంటాం
రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కూరెళ్లలో ఆయన ఏరువాక పౌర్ణమి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక అన్నారు.
- బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్
- సిద్దిపేట జిల్లా కోహెడ మండలం కూరెళ్లలో ఏరువాక పౌర్ణమి
కోహెడ, జూన్ 29: రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణాశాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలోని కూరెళ్లలో ఆయన ఏరువాక పౌర్ణమి నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏరువాక పౌర్ణమి తెలంగాణ రైతాంగ సంస్కృతికి ప్రతీక అన్నారు. సాగునీటి వసతుల పెరుగుదల , నాణ్యమైన విత్తనాలు, ఎరువుల సరఫరా, వ్యవసాయానికి అవసరమైన మౌలిక వసతుల కల్పనతో పాటు అన్ని రకాలుగా అండగా ఉంటామన్నారు.
వ్యవసాయ అధికారుల సూచనలు పాటిస్తూ నాణ్యమైన విత్తనాలు మాత్రమే వాడాలన్నారు. నీటిని పొదుపుగా వినియోగిస్తూ ప్రకృతికి అనుకూల వ్యవసాయాన్ని ప్రోత్సహించాలన్నారు. వాతావారణ మార్పులను దృష్టిలో ఉంచుకొని పంటల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన రైతులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి అధిక దిగుబడులు సాధించాలన్నారు. ఈకార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్పర్సన్ బోయిని నిర్మలాజయరాజ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు శెట్టి సుధాకర్, సర్పంచ్ బండారి లక్ష్మి, నాయకులు మంద ధర్మయ్య, చేపూరి శ్రీశైలం, బందెల బాలకిషన్, వివిధ గ్రామాల సర్పంచ్లు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay | తమిళనాడు సీఎం విజయ్తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. దళపతిపై రౌడీ హీరో ఆసక్తికర వ్యాఖ్యలు!
Singareni Karmika Garjana | రేపే సింగరేణి కార్మిక గర్జన.. 30 వేల మందిని సభకు సమీకరించేందుకు సన్నాహాలు
ప్రాణం తీసిన మెట్రో సీటు గొడవ.. ఢిల్లీలో మాజీ ఐఏఎస్ అధికారి అరెస్ట్
Indiramma Saree | ఇందిరమ్మ చీర.. ఇంటికి కర్టెన్!
Farmers | అన్నదాతతో సర్కార్ ఆటలు.. కరువు సమీక్షకు పిలిచి.. తీరా రైతులు వచ్చాక మీటింగ్ రద్దు
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

