దేవుడి పేరుతో బీజేపీ రాజకీయాలు
దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ అయోధ్య రామమందిరం డబ్బులు వాడుకున్న పార్టీ బీజేపీ అని రాష్ట్ర రవా ణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని జిల్ల్లెలగడ్డలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్య రామమందిరంలో అవినీతి జరిగిందని, దీనిపై బీజేపీ నా యకులు స్పందించాలన్నారు.
- అయోధ్య ఘటనపై బీజేపీ నాయకులు స్పందించాలి
- రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్
హుస్నాబాద్‌రూరల్, జూలై 6: దేవుడి పేరుతో రాజకీయాలు చేస్తూ అయోధ్య రామమందిరం డబ్బులు వాడుకున్న పార్టీ బీజేపీ అని రాష్ట్ర రవా ణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని జిల్ల్లెలగడ్డలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అయోధ్య రామమందిరంలో అవినీతి జరిగిందని, దీనిపై బీజేపీ నా యకులు స్పందించాలన్నారు.
హిందువులు ఎంతో విశ్వాసంతో రామమందిరం నిర్మాణం కోసం విరాళాలు అందించారన్నారు. అయోధ్య రామమందిరంలో జరిగిన అవినీతిపై ప్రధాని నరేంద్రమోదీ, అమిత్‌షా ఎందుకు స్పందించడం లేదన్నారు. అయోధ్యలో సొమ్ములు దొంగిలించడం హిందువులందరికీ అవమానకరమన్నారు. భక్తి పేరుతో రాజకీయాలు చేసే నాయకులందరూ ఇప్పు డు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించా రు. రామ మందిరంలో జరిగిన ఘటనపై దేశ ప్రజలకు బీజేపీ నాయకులు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో ఓటరు సవరణ ప్రక్రియ జరుగుతుందని, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు మిస్ కాకుండా చూసుకోవాలన్నారు. ఓటరు సవరణ ప్రక్రియ విజయవంతంగా జరిగేందుకు ప్రతిఒక్కరూ సహకరించాలని కోరారు. సమావేశంలో హుస్నాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ దండి లక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెన్న రాజు, పట్టణ అధ్యక్షుడు వీవీ రమణ, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

