రామాయంపేట, అక్టోబర్ 19: మెదక్ జిల్లా రామాయంపేట వద్ద జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న ఎండు గంజాయి లభ్యమైంది. రామా యం పేట పోలీసుల వివరాల ప్రకారం..హైదరాబాద్ నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఏపీకి చెం దిన ఓ కారు మార్గమధ్యలో రామాయంపేట బైపాస్ వద్ద అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టి పల్టీ కొట్టింది.
ఈ ప్రమాదంలో కారులో ఉన్నవారికి గాయాలు కావడంతో అక్కడి నుంచి వెళ్లిపో యారు. తెల్లవారు జామున హైవే పోలీసులు కారు వద్దకు వచ్చి పరిశీలించగా అందులో ఎం డు గంజాయి ప్యాకెట్లు లభించాయి. రామాయంపేట ఎస్సై బాలరాజు ఆధ్వర్యంలో పోలీసులు కారులో తనిఖీలు చేయగా డిక్కీలో, సీట్ల కింద తదితర ప్రాంతాల్లో తరలిస్తున్న ఎండు గంజాయి ప్యాకెట్లు లబించాయి. మొత్తం 87కిలోల 75 గ్రాముల ఎండు గంజాయి లభించిం ది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బాలరాజు తెలిపారు.