Bindover | నర్సాపూర్: తహశీల్దార్ ఎదుట తొమ్మిది మందిని శనివారం బైండోవర్ చేసినట్లు ఎస్ఐ రంజిత్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని గూడెంగడ్డ గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రవర్తన నియమాలను ఉల్లంఘిస్తూ.. పలువురు గొడవలకు దారి తీసే ప్రయత్నం చేశారన్నారు. వారిని తహశీల్దార్ ఎదుట బైండోవర్ చేసినట్లు తెలిపారు. ఇందులో గూడెం గడ్డ గ్రామానికి చెందిన మన్నె నవీన్, ఆకుల నర్సింలు, ఆవంచ అంజనేయులు, ఆవంచ సహదేవ్, మన్నె చంద్రయ్య, ఆవంచ విక్రమ్, ఆవంచ నరేశ్, పండుగ రవి, ఆవంచ శేఖర్ ఉన్నారు. గ్రామాల్లో అల్లర్లు సృష్టించిన, ఎన్నికల నియమాలను ఉల్లంఘించిన చట్టపరమైన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు.