సూరారంలో పోలీస్ పికెట్
వరుస హత్యలతో సూరారంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో జంట హత్యలతో పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్నది.
చిన్నశంకరంపేట, జూన్ 24: వరుస హత్యలతో సూరారంలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకున్నది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని సూరారం గ్రామంలో జంట హత్యలతో పోలీస్ పికెటింగ్ కొనసాగుతున్నది. రెండు రోజుల క్రితం గ్రామానికి చెందిన శ్రీధర్‌ను ప్రభాకర్ అనే వ్యక్తి మిత్రులతో కలిసి ఆటోతో ఢీకొట్టి కిరాతకంగా హత్యచేశారు.
ప్రతీకారంగా నిందితుడు ప్రభాకర్ తండ్రి యాదగిరిని శ్రీధర్ బంధువులు హత్యచేసి హల్దీవాగులో పడేసిన విషయం విధితమే. దీంతో గ్రామంలో పోలీసులు రెండు రోజులుగా కట్టుదిట్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. మృతుడు శ్రీధర్ అంత్యక్రియలు మంగళవారం రాత్రి పోలీస్ బందోబస్తు నడుమ జరిగాయి.
బుధవారం యాదగిరి అంత్యక్రియలు జరగాల్సి ఉండగా, గ్రా మంలో ఉద్రిక్త పరిస్థితులు ఉండటంతో పోలీసుల సూచనల మేరకు బంధువులు నర్సాపూర్‌లో అంత్యక్రియలు ని ర్వహించారు. ఉన్నతాధికారుల సూచనల మేరకు గ్రామం లో పికెటింగ్ కొనసాగుతున్నదని ఎస్సై శివానందం తెలిపా రు. ప్రస్తుతం గ్రామంలో ప్రశాంత వాతావరణం ఉన్నదని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు చర్యలు తీసుకుంటున్నారని ఎస్సై పేర్కొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

