తెలంగాణ రాష్ట్ర సరిహద్దులో ప్రత్యేక నిఘా
కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో శాసన సభ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూ ల్ విడుదల చేసిన ఎన్నికల నియమవళి వెంటనే అమలు చేయడంతో రాష్ట్ర సరిహద్దులో పోలీసు అధికారులు చెక్‌పోస్టులు ప్రారంభించారు.
- నేరాలు అదుపునకు పోలీసుల పకడ్బందీ చర్యలు
- ప్రశాంతంగా శాసన సభ ఎన్నికలు జరిగేందుకు చెక్‌పోస్టులు
- నేరస్తుల కదలికలపై పోలీసుల నిఘా
- మద్యం, నగదు సరఫరా నియంత్రణకు చర్యలు
- గంజాయి, మాదక ద్రవ్యాల రవాణాపై ప్రత్యేక నిఘా
- సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు
- రాష్ట్ర సరిహద్దు రోడ్లపై మొబైల్ టీంలు ఏర్పాటు
జహీరాబాద్, అక్టోబర్ 10 : కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణలో శాసన సభ ఎన్నికలు నిర్వహించేందుకు షెడ్యూ ల్ విడుదల చేసిన ఎన్నికల నియమవళి వెంటనే అమలు చేయడంతో రాష్ట్ర సరిహద్దులో పోలీసు అధికారులు చెక్‌పోస్టులు ప్రారంభించారు. తెలంగాణలో ఎన్నికల నోటికేషన్ విడుదల నవంబర్ 3న జారీ చేస్తామని ప్రకటించారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సరిహద్దులో ప్రత్యేక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి వాహనాల తనిఖీలు ప్రారంభించారు. కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో 65వ జాతీ య రహదారిపై చెక్‌పోస్టులు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేస్తున్నారు.
జహీరాబాద్ నియోజకవర్గంలో కర్ణాటక సరిహద్దులో ఉన్న 65 జాతీయ రహదారిపై చెరాగ్‌పల్లి, మొగుడంపల్లి మండలంలోని గౌసాబాద్ తండా, కోహీర్ మండలంలోని మనియార్‌పల్లి శివారు, గోటిగార్పల్లి పంచాయతీ పరిధిలోని సిద్దాపూర్తండా, న్యాల్కల్ మండలంలోని బీదర్-జహీరాబాద్ రోడ్డు పై గణేశ్‌పూర్, శంశోల్లాపూర్, డప్పుర్, హుసేనగర్ శివారులో ఉన్న సరిహద్దులో చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వీటితో పాటు మొబైల్ వాహనాలు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు.
రాష్ట్ర సరిహద్దులో ప్రత్యేక నిఘా..
తెలంగాణకు సరిహద్దులో ఉన్న రోడ్లుపై పోలీసు, రెవెన్యూ, ఎక్సైజ్, అటవీ శాఖ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయడం ప్రారంభించారు. కర్ణాటక రాష్ర్టానికి సరిహద్దులో ఉన్న గ్రామాలకు సమీపంలో తాత్కాలిక చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి శాసన సభ ఎన్నికలు ముగిసే వరకు వాహనాలు తనిఖీలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. నేరాస్తుల కదిలికలపై నిఘా ఏర్పాటు చేశారు. కర్ణాటక, మహారాష్ర్ట వైపు నుంచి నగదు, మద్యం, గంజాయి, మాదక ద్రవ్యాలు తెలంగాణ వైపు రాకుండా నివారణ చర్యలు తీసుకోనేందుకు ఎన్నికల కమిషనర్ ఆదేశాలు జారీ చేసింది. పోలీసు చెక్‌పోస్టులో తహసీల్దార్, ఎస్సై స్థాయి అధికారిని నియమించి పర్యవేక్షణ చేసేందుకు ఉన్నత అధికారులు ఆదేశాలు జారీ చేశారు. సరిహద్దులో బీదర్, చించొళి, హుమ్నాబాద్ తాలుక కేంద్రాలు ఉన్నాయి. అక్కడి పోలీసు అధికారులతో ప్రతి సమాచారం సేకరించి సమన్వయంతో పని చేసేందుకు జహీరాబాద్ పోలీసు అధికారులు పర్యవేక్షణ చేస్తున్నారు.
సమస్యాత్మక ప్రాంతాలు గుర్తింపు
శాసన సభ ఎన్నికలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ఉండేందుకు పోలీసు, రెవెన్యూ అధికారులు సమస్యాత్మక ప్రాంతాలు గుర్తించారు. జహీరాబాద్ నియోజకవర్గంలో 313 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. నియోజకవర్గంలో 2,64, 732 లక్షల ఓటర్లు ఉన్నారు. సమస్యాత్మక కేంద్రాలు గుర్తించి అక్కడ ఎలాంటి సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. కొన్ని పోలింగ్ కేం ద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షణ చేసేందుకు ఏర్పాట్లు చేశా రు. పాత నేరాస్తులు, రౌడీ షీటర్లు కదిలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు.
అక్రమ రవాణాకు కేంద్రాలుగా ఉన్న ప్రాంతాలు..
- జహీరాబాద్ మండలం జాతీయ రహదారిపై ఉంది. కర్ణాటక, మహారాష్ర్టా వైపు నుంచి అధికంగా 65వ జాతీయ రహదారి గుండా వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. ఇక్కడ తెలంగాణ, కర్నాటక పోలీసులు తనిఖీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. జహీరాబాద్ నుంచి మొగుడంపల్లి మీదగా చించొళి రోడ్డుపై గౌసాబాద్ తండా శివారులో చెక్‌పోస్టు ప్రారంభిస్తున్నారు.
- ముంబాయి-హైదరాబాద్ 65వ జాతీయ రహదారిపై చెరాగ్‌పల్లి శివారులో మాడ్గి చౌరస్తాలో పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు. జాతీయ రహదారిపై చెక్‌పోస్టు ఏర్పాటు చేసి గంజాయి, మద్యం, నగదు, సరఫరా కాకుండా చర్యలు తీసుకుంటున్నారు.
- జహీరాబాద్ నుంచి తాండూరు వైపు వెళ్లే రోడ్డు కర్ణాటకలో కలబుర్గా జిల్లాలోని కుంచారం -కోహీర్ మండలంలోని సిద్దాపూర్తండా శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తున్నారు.
- బీదర్ – జహీరాబాద్ రోడ్డుపై న్యాల్కల్ మండలంలోని గణేశ్‌పూర్ శివారులో పోలీసు చెక్‌పోస్టు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీలు చేస్తున్నారు.
- బీదర్- న్యాల్కల్ మార్గంలో డప్పూర్ శివారులో చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తున్నారు.
- కోహీర్ – మనియార్‌పల్లి మార్గంలో రాష్ట్ర సరిహద్దులో చెక్‌పోస్టు ఏర్పాటు చేస్తున్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్‌లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్‌బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

