రామాయంపేట, డిసెంబర్ 5 : గుట్టుచప్పుడు గాకుండా గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్న ఓ వ్యక్తిని పట్టుకుని అరెస్తు చేసినట్లు మెదక్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ఫోర్స్ సీఐ భీంరెడ్డి రాంరెడ్డి వెల్లడించారు.
సోమవారం రామాయంపేట మండలం అక్కన్నపేట గ్రామ శివాలయం ప్రాంతంలో ఓ వ్యక్తి గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు సమాచారం మేరకు దాడు లు చేయగా, అత్మకూరు సాయిలు అనే వ్యక్తి వద్ద పదిగ్రాముల ప్యాకెట్లు 32 లభించాయని తెలిపారు. నిందితుడితో పాటు గంజాయిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.