నాగల్గద్ద, ఫిబ్రవరి 21: సంగారెడ్డి జిల్లా నాగల్గిద్ద మండల పరిధిలోని మావినేల్లి గ్రామంలో సక్రునాయక్ తాండ మార్కెట్ కమిటీ యార్డులో ప్రభుత్వ రంగ సంస్థలైన నాఫేడ్ మార్క్ఫెడ్ అధ్వర్యంలో పక్షం రోజుల క్రితం కందుల కోనుగోళ్లు ప్రారంభించారు. కానీ ఇప్పటివరకు కొనుగోళ్లు చేపట్టకపోవడంతో రైతులు అందోళన చెందుతున్నారు.
గత జూన్, జూలై నెలల్లో కంది పంట ప్రస్తుతం రైతులు చేతికొచ్చింది. పంట అమ్మడానికి రైతులు సిద్ధం చేసి ఉంచారు. బహిరంగ మార్కెట్ ధర రూ, 6900 నుంచి రూ 7200 వరకు మాత్రమే పలుకుతుంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ, 7500 ఉండటంతో రైతులు మార్కెట్కు తీసుకొచ్చి అమ్మడానికి సిద్ధం ఉన్నారు. మార్క్ఫెడ్ అధికారులతో పాటు సహకార సంఘం, వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి ఫిబ్రవరి మొదటి వారంలో మార్కెట్ యార్డులో కందులు కోనుగోలు లాంఛనంగా ప్రారంభించారు. పక్షం రోజులు గడుస్తున్న ఇంకా పూర్తి స్థాయిలో కొనుగోలు చేయడం లేదు. గన్ని బ్యాగులు కొరత వల్ల కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయని అధికారులు చెబుతున్నారు. అయితే మార్క్ఫెడ్ నుంచి కొనుగోళ్లు జరగకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే కొనుగోళ్లు ప్రారంభించాలని కోరుతున్నారు.