విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఇతరత్రా అవసరాల నిమిత్తం ఎక్కడెక్కడో ఉంటున్న వారంతా దసరా పండుగకు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు. తెలంగాణలో పెద్ద పండుగైన విజయదశమికి ఆర్టీసీ సరిపడా బస్సులు ఏర్పాటు చేయకపోవడంతో సొంతూరికి చేరుకోవడానికి ప్రజలు తిప్పలు పడుతున్నారు.
మహాలక్ష్మి పథకంలో అసలే ఆర్టీసీ బస్సులు కిటకిటలాడుతున్నాయి. ఇప్పు డు పండుగ సందర్భంగా బస్సుల్లో ఫుల్ జనం ఎక్కుతున్నారు. దీంతో బస్సుల్లో పరిమితికి మంచి ప్రయాణిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు సరిపడా నడవకపోవడంతో ప్రజలు ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ఇంటికి చేరుకుంటున్నారు.
– సంగారెడ్డి ఫొటోగ్రాఫర్, అక్టోబర్ 11