Pushpala Vagu | మెదక్ రూరల్, సెప్టెంబర్ 13 : గత నెల 27న కురిసిన భారీ వర్షాలకు మెదక్ మండల పరిధిలోని మక్తా భూపతి పూర్, తిమ్మనగర్, గుట్టకిందపల్లి, శివాయపల్లి, మల్కాపూర్ తండా, మల్కాపూర్ గ్రామాలకు వెళ్లే పుష్పాల వాగు వంతెన కొట్టుకపోవడంతో 6 గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇప్పటివరకు ఎలాంటి పునరుద్ధరణ పనులు ప్రారంభించలేదు. దీంతో గ్రామ ప్రజలు చేసేదేమి లేక కొముటూర్ నుండి మెదక్ పట్టణానికి అదనంగా 14 కిలోమీటర్ల దూరం వెళ్లాల్సి వస్తోంది. రెండు రోజుల నుంచి భారీ వర్షాలు పడడంతో కొంటూరు చెరువు అలుగు పారుతోంది.
అలుగుతో నీటి ప్రవాహం రోడ్డుపై నుంచి ఉధృతిగా ప్రవహిస్తోండటంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి కూలిన రహదారి వంతెనల వద్ద తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రవాణా సౌకర్యం కలిగించాలని ప్రజలు కోరుతున్నారు.
Edupayala Temple | పెరిగిన వరద.. వనదుర్గ ఆలయం మరోసారి మూసివేత
Rayapole | కొత్తపల్లిలో పడకేసిన పారిశుధ్యం.. వ్యాధుల బారిన పడుతున్న ప్రజలు
Tragedy | రెండేళ్ల కూతుర్ని పాతిపెట్టి.. ప్రియుడితో పరారైన మహిళ.. మూడు నెలల తర్వాత బయటపడ్డ నిజం!