సిద్దిపేట, మార్చి 21(నమస్తే తెలంగాణ ప్రతినిధి): అయ్యా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి… మీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 27 నెలలు దాటుతున్నది. సిద్దిపేట నియోజకవర్గానికి ఒక్క రూపాయి నిధులు విడుదల చేయలేదు. సిద్దిపేట అభివృద్ధిని విస్మరించడమే కాకుండా బీఆర్ఎస్ హయాంలో మంజూరైన నిధులను రద్దు చేశారు. నిధులు రద్దు చేయడంతో పనులు ఆగిపోయాయి. బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో సిద్దిపేట నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం రూ.1070.73 కోట్లు కేటాయించారు.
ఆనిధులతో అభివృద్ధి పనులు చేపట్టి కొనసాగిస్తుండగా అర్ధాంతరంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు రద్దు చేసిం ది. దీంతో పనులన్నీ ఆగిపోయాయి. చేసిన పనులకు కూడా నిధులు మంజూరు చేయలేదు. మరికొన్ని వివిధ దశల్లో ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గంపై కాంగ్రెస్ ప్రభుత్వం పగబట్టిందని ఈ ప్రాంత ప్రజలు మండిపడుతున్నారు. సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ఎన్నిసార్లు ప్రభుత్వానికి మొరపెట్టుకున్నా ఏమాత్రం పట్టించుకోలేదు. కొత్తవి ఇవ్వకపోయినా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరై పనులు నడుస్తున్న క్రమంలో ఉన్న ఫలంగా వాటిని రద్దు చేసిండ్రు… మా నిధులు మాకు ఇవ్వండి అని ప్రభుత్వానికి లేఖలు రాయడంతో పాటు శాసనసభా వేదిక ద్వారా గొంతెత్తిన విషయం తెలిసిందే.
ఇవ్వాళ ఇక్కడ ఏంఉద్ధరించారని ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి సీఎం రేవంత్‌రెడ్డి వస్తున్నావు అని ప్రజలు సూటిగా ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూ రు చేసిన రూ. 300 కోట్లతోనే ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ నిర్మా ణం అయ్యింది. కానీ తామే చేశామని కాంగ్రెస్ గొప్ప లు చెప్పుకుంటుంది. వాస్తవాలు ఇక్కడి రైతులు, ప్రజలకు తెలుసు. ముందుగా సిద్దిపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేసిన నిధులు తిరిగి మంజూ రు చేసి ఈ గడ్డమీద అడుగుపెట్టాలని ఈ ప్రాంత ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డిని డిమాండ్ చేస్తున్నారు.
సిద్దిపేట వెటర్న రీ కళాశాలను సీఎం రేవంత్‌రెడ్డి తన కొడంగల్ నియోజకవర్గానికి తీసుకుపోయారు. దీంతో ఇక్కడి ప్రాంత ప్రజ లు వ్యతిరేకిస్తున్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం, ఎమ్మెల్యే, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకు సిద్దిపేట కలెక్టరేట్ కార్యాలయ సమీపంలో (పీ.వీ నరసింహరావు తెలంగాణ పశు వైద్య విద్యాలయం) వెటర్నరీ కళాశాల మంజూరు చేసిన విషయం తెలిసిందే. 30 ఎకరాల విస్తీర్ణంలో బాలురు, బాలికల వసతితో పాటు కళాశాల నిర్మాణం చేపట్టేలా రూపకల్పన చేశారు. ఇందుకు రూ. 180 కోట్లు అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిం ది.
నిధులు కేటాయించి పనులు కూడా ప్రారంభించారు. 2024 విద్యాసంవత్సరం నుంచి తరగతులు కూడా ప్రారంభించడానికి ఉత్తర్వులు విడుదల చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం కుట్రలు చేసి ఇక్కడ నిర్మాణంలో ఉన్న కళాశాల పనులు మధ్యలో నిలిపివేసింది. కాంగ్రెస్ సరారు కళాశాలను రద్దు చేయడంతో ఈ ప్రాంత విద్యార్థుల ఆశలు నీరుగారాయి. కళాశాలను రద్దు చేయడంతో మధ్యలో ఆగిన పనులు దర్శనమిస్తున్నాయి.
సిద్దిపేట జిల్లా ఎన్నో ఏండ్ల కల.. ఈ పాంత ప్రజల చిరకాల వాంఛ. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వా త కేసీఆర్ సిద్దిపేట జిల్లాను ఏర్పాటు చేశారు. నూతన సమీకృత కలెక్టరేట్ నిర్మాణంతో పాటు రెవెన్యూ డివిజన్లు, నూతన మండలాలు ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత ప్రజలకు ఎంతో మేలు జరిగింది. సమైక్యరాష్ట్రంలో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా జిల్లా ఏర్పాటు చేయలేదు. కేసీఆర్ సీఎం అయిన తర్వాత జిల్లా ఏర్పా టు కావడంతో అన్నిరంగాల్లో సిద్దిపేట జిల్లా అగ్రగామిగా నిలిచింది. దీనిని జీర్ణించుకోలేని ప్రస్తుత ప్రభు త్వం సిద్దిపేట జిల్లా రద్దుకు కుట్రలు చేస్తోంది.
సిద్దిపేట నియోజకవర్గంలో చాలా పనులను ప్రభు త్వం రద్దుచేసింది. ప్రభుత్వ వెటర్నరీ కళాశాల, రంగనాయక సాగర్ టూరిజం, కోమటిచెరువుశిల్పారా మం, సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్డు, తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాల, మిట్టపల్లిలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల భవనం, సిద్దిపేటలో క్రీడాకారుల కోసం స్పోర్ట్స్ హబ్, టుటౌన్ పోలీస్ స్టేషన్ భవనం, త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట- ఇల్లంతకుంట ఫోర్ లేన్ రోడ్డు, సిద్దిపేట- కిష్టాపూర్ రహదారి, సిద్దిపేటలో మల్టీపర్పస్ ఆడిటోరియం, సిద్దిపేట బ్లాక్ ఆఫీస్ సమీపంలో ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌వెజ్ మారెట్ పనులను ప్రభుత్వం రద్దు చేసింది.
సిద్దిపేట నియోజకవర్గాన్ని మరింత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నిధులు మంజూరయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనిధులు రద్దు చేయడంతో పనులు అర్ధాంతరంగా ఆగిపోయాయి. సిద్దిపేట పట్టణంలోని కోమటిచెరువు వద్ద శిల్పారామం, నెక్లెస్ రోడ్డు పనులు నిలిచిపోయాయి. రంగనాయకసాగర్ వద్ద రూ. 100 కోట్లతో టూరిజం స్పాట్ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన పనులు ప్రారంభించింది. ఇంతలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అవిపునాదుల స్థాయిలోనే ఉన్నాయి.
సిద్దిపేట-ఇల్లంతకుంట రహదారి విస్తరణకు ప్రభుత్వం నిధులు కోత పెట్టింది. చిన్నకోడూరు నుంచి ఇల్లంతకుంట వరకు విస్తరణ పనులకు నిధులు రద్దు చేసింది. చిన్నకోడూరు నుంచి సలెంద్రి, కమ్మర్లపల్లి, మైలారం, అల్లీపూర్, కిష్టాపూర్ జంక్షన్ మీదుగా సిరిసిల్ల జిల్లాలోని ఇల్లంతకుంట వరకు విస్తరణ పనులకు బ్రేక్‌పడింది. సిద్దిపేట-ఇల్లంతకుంట ఫోర్‌లేన్ రోడ్డు (కి.మీ 10/0 నుంచి 22/0) రూ.77 కోట్లు, సిద్దిపేట- ఇల్లంతకుంట ఫోర్‌లేన్ రోడ్డు( కి.మీ 22/0 నుంచి 32/0) రూ. 82( రాజన్నసిరిసిల్ల జిల్లా), కేసీఆర్ ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఆ నిధులు రద్దు చేసింది.