అమీన్పూర్, ఏప్రిల్ 30: బీఆర్ఎస్తోనే సమగ్ర అభివృద్ధి సాధ్యమని పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి అన్నారు. ఆదివారం అమీన్పూర్ మున్సిపాలిటీలోని పలు కాలనీలకు చెందిన ఇతర పార్టీల యువకులు 200 మంది, మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అంతకుముందు బీరంగూడ కమాన్ నుంచి భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో బీఆర్ఎస్తో భారీ రాజకీయ మార్పులు వస్తాయన్నారు. కేసీఆర్ వంటి నాయకుడు దేశానికి అవసరమన్నారు. రాష్ట్రం అమలవుతున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి దేశానికే ఆదర్శమన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నర్సింహగౌడ్, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, కాలప్ప, జగదీశ్, మహిపాల్‌రెడ్డి, చంద్రశేఖర్, యూనూస్, ప్రమోద్‌రెడ్డి, జనార్దన్‌రెడ్డి పాల్గొన్నారు.
జిన్నారంలో..
జిన్నారం, ఏప్రిల్ 30: అందరి సంక్షేమమే రాష్ట్ర ప్రభు త్వ ధ్యేయమని ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నా రు. మండలంలోని అండూరు గ్రామానికి చెందిన ముప్పై మంది బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీఆర్ఎస్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై పలువురు పార్టీలో చేరుతున్నారన్నారు. జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, అండూరు సర్పంచ్ ఖదీర్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజేశ్, వెంకట్‌రెడ్డి, రామకృష్ణ, రాజు, శ్రీధర్‌గౌడ్, మహేశ్ పాల్గొన్నారు.