సిద్దిపేట అర్బన్, ఆగస్టు 25: రాష్ట్రంలో డెం గీ, ఇతరత్రా జ్వరాలతో దవాఖానల్లో బెడ్లు దొరక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుం టే.. రాష్ట్ర ప్రభుత్వం ఏంచేస్తున్నదని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు ప్రశ్నించారు. పీసీసీల కోసం, మంత్రి పదవుల కోసం ఢిల్లీకి వెళ్లడం తప్పా అసలు ఈ ప్రభుత్వం నడుస్తుందా.. అని అడిగారు. ఆదివారం సిద్దిపేట పట్టణ శివారులోని బీజేపీ జిల్లా కార్యాలయంలో ఆయన ప్రెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ..రా ష్ట్రంలో ఒకరోజే ఐదుగురు డెంగీతో చనిపోయారని వార్తలు వస్తున్నాయన్నారు. వాతావరణంలో జరిగే మార్పుల వల్ల విషజ్వరాలు ప్రబలుతున్నాయని ప్రభుత్వం వెంటనే స్పందించి సమీ క్ష నిర్వహించడంతో పా టు దవాఖానల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. హైడ్రా పేరుతో సమస్యలను పకదారి పట్టించవద్దన్నారు.
ప్రభుత్వ దవాఖానల్లో కాలం చెల్లిన మందులు ఇవ్వడం వల్ల నేడు పిల్లలు చనిపోయే పరిస్థితి రాష్ట్రంలో ఉన్నదన్నారు. ప్రభుత్వ దవాఖానల్లో సిబ్బందిని నియమించాలన్నారు. గ్రామాల్లో పారిశు ధ్యం పడకేసిందన్నారు. రాష్ట్రంలో వెంటనే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని, స్థానిక సంస్థల ఎన్నికలు తొందరగా నిర్వహించకపోతే కేంద్రం నిధులు ఆలస్యమవుతాయన్నారు. సమావేశంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్‌రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.