రామాయంపేట, నవంబర్ 1 : రోడ్డు దాటుతుండగా ఓ బైక్ పాదచారున్ని ఢీకొనడంతో పాదాచారుడు అక్కడికక్కడే దుర్మరణం చెందిన సంఘటన రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఆదివారం రాత్రి చోటుచేసు కుంది.
రామాయంపేట, ఎస్సై రాజేష్ కథనం ప్రకారం.. పట్టణానికి చెందిన బైరం దుర్గయ్య(45) ఆదివారం రాత్రి రోడ్డు దాటుతున్న క్రమంలో మండలంలోని సుతారిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు ఒకే బైక్పై వచ్చి దుర్గయ్యను ఢీకొట్టారు.
దీంతో తీవ్రగాయాలైన ఆయన అక్కడికక్కడే మృత్యువాత పడ్డట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్తుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖాన మార్చురీకి తరలించారు. బాధిత కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దార్యాప్తు చేస్తున్నారు. మృతుడికి భార్య కళావతి, ఇద్దరు పిల్లలు ఉన్నారు.