పెద్దశంకరంపేట, ఫిబ్రవరి 21 : విద్యార్థులు పోటీతత్వం అలవర్చుకుంటే ఆశించిన ఫలితాలు సాధించవచ్చని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ శోభారాణి అన్నారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వార్షికోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఉన్నత చదువులు చదివి మంచి భవిష్యత్తును తల్లిదండ్రులకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని సూచించారు.
క్రమశిక్షణతో చదివితే బంగారు భవిష్యత్తు ఉంటుందని ప్రిన్సిపాల్ శోభారాణి అన్నారు. విద్యార్థులకు ఇంటర్మీడియట్ దశ ఎంతో కీలకమని పర్యావసనాలకు దూరంగా ఉంటే భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని తెలిపారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రెక్కలు ముక్కలు చేసుకొని కళాశాలకు పంపిస్తున్నారని క్రమశిక్షణతో చదువుకోవాలని సూచించారు. ఈ సందర్బంగా విద్యార్థినిలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యాలు, బృందనృత్యాలు, పాటలు పలు ప్రదర్శనలు పలువురిని అలరించి విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు హరిత, అనంత్‌రాజ్, ప్రభాకర్, రమేశ్, రాజు, శ్రీశైలం, మల్లేశం, జహీరా బేగం, కిష్టారెడ్డి, విజయభాస్కర్, శ్రీలత, అశ్విని, తదితరులు ఉన్నారు.