Govt degree College | మండల పరిధిలోని పెద్దచింతకుంట గ్రామ సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్‌ను పెంచేందుకు సిబ్బంది వినూత్న కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది నిష్ణాతులైన అధ్యాపకులచే బోధన, డిజిటల్ తరగతులు, ఆధునిక ప్రయోగశాలలు మా కళాశాలలో ఉన్నాయంటూ.. మా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేరండంటూ వినూత్నంగా ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థులకు కరపత్రాలను అందజేస్తూ కోరడం జరిగింది.
నర్సాపూర్‌లో ఇంటర్ పరీక్షలు రాసి బయటకు వచ్చిన విద్యార్థులకు కరపత్రాలను పంపిణీ చేస్తూ తమ కళాశాలలో చేరాలంటూ ప్రచారం చేశారు. కళాశాలలో గల ప్రత్యేకతలను విద్యార్థులకు తెలియజేస్తూ అడ్మిట్ కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సమీరా, సురేశ్‌కుమార్, అదెప్ప, రమేశ్, శ్రీనివాస్, ఆరీఫ్, మహేందర్‌రెడ్డి, రాజు, రాము పాల్గొన్నారు.
సాధారణంగా ప్రవేట్ విద్యా సంస్థలకు చెందిన సిబ్బంది ఇలా చేస్తుండటం చూస్తుంటాం. అయితే ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అడ్మిషన్ల కోసం సరికొత్తగా ప్రయత్నిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సిబ్బంది.
Vishnupriya | బెట్టింగ్ యాప్ కేసు.. విష్ణుప్రియ ఫోన్‌ని సీజ్ చేసిన పంజాగుట్ట పోలీసులు