పాపన్నపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాతను పాట్నా హైకోర్టు న్యాయమూర్తి అనుపమా చక్రవర్తి సకుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారు శనివారం ఏడుపాయలకు చేరుకోగానే మెదక్ అదనపు కలెక్టర్ నగేష్, ఆర్డీవో రమాదేవి స్వాగతం పలికారు. ఒక మొక్కను జ్ఞాపికగా అందజేశారు.
ఆలయ ఈవో చంద్రశేఖర్ న్యాయమూర్తికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈవో చంద్రశేఖర్, సిబ్బంది శ్రీనివాస్, అర్చకులు శంకర్ శర్మ, పార్థివ శర్మ పాల్గొన్నారు. పాపన్నపేట ఎస్ఐ శ్రీనివాస్ గౌడ్ బందోబస్తు నిర్వహించారు.