పాపన్నపేట, జూలై 23 : సింగూరు ప్రాజెక్టు నుంచి ఘనపూర్ ఆనకట్టకు 4.06 టీఎంసీల నీటిని నింబంధనల ప్రకారం విడుదల చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి బుధవారం మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్‌లోని సచివాలయంలో మంత్రిని కలిసి లెటర్ అందజేశారు. ఈ నీటిని విడుతల వారీగా విడుదల చేయాలన్నారు. జూలై నెలాఖరు వస్తున్నా నీరు ఇవ్వడం లేదని, నారుమడులు ఎండిపోకుండా తక్షణమే నీటిని వెంటనే విడుదల చేయాల ని మంత్రిని కోరినట్లు మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి తెలిపారు.