కోహీర్, ఆగస్టు 26: సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఏరియా దవాఖానకు చికిత్స కోసం సోమవారం భారీ సంఖ్యలో రోగులు తరలివచ్చారు. గ్రామాలు, తండాలు అపరిశుభ్రంగా తయారు కావడంతో రోగుల సంఖ్య పెరుగుతున్నది. మురుగు కాల్వలను సకాలంలో శుభ్రం చేయకపోవడంతో దోమలబడద పెరిగింది. దీంతో ప్రజలు డెంగీ, డయేరియా తదితర రోగాల బారిన పడుతున్నారు.
జహీరాబాద్ దవాఖానలో 62 మందికి పరీక్షలు చేయగా అందులో 8 మందికి డయేరియా సోకినట్లు నిర్ధారించారు. దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్‌ను వివరణ కోరగా ఎనిమిది మంది డయేరియాతో చికిత్స పొందుతున్నారని, ఇంత వరకు డెంగీ నిర్ధారణ కాలేదన్నారు. కోహీర్ మండలంలోని పోతిరెడ్డిపల్లిలో ఓ వ్యక్తి, బడంపేటలో మరొకరు డెంగీతో చికిత్స పొందుతున్నారు.