వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ప్రజాకంటక ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేరోజులు దగ్గరపడ్డాయన్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్లకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కీలక నాయకులు, కార్యకర్తలు 50 మంది ఆదివారం పటాన్‌చెరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
- ప్రజాకంటక ప్రభుత్వానికి త్వరలోనే చరమగీతం
- ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
- చిన్నకంజర్లలో బీజేపీ, కాంగ్రెస్‌కు బిగ్ షాక్
- ఎమ్మెల్యే సమక్షంలో 50 మంది బీఆర్ఎస్లో చేరిక
పటాన్చెరు టౌన్, జూన్ 21: రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి అన్నారు. ప్రజాకంటక ప్రభుత్వానికి ప్రజలు త్వరలోనే చరమగీతం పాడేరోజులు దగ్గరపడ్డాయన్నారు. సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపల్ పరిధిలోని చిన్నకంజర్లకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల కీలక నాయకులు, కార్యకర్తలు 50 మంది ఆదివారం పటాన్‌చెరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా హైడ్రా పేరుతో ప్రభుత్వం విధ్వంసం సృష్టిస్తున్నదన్నారు. రెండేండ్లుగా పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడంలో కాంగ్రెస్ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నదన్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తిరిగి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కౌన్సిలర్ ఊర్మిల వెంకట్‌రెడ్డి, మాజీ సర్పంచ్ నారాయణరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన విజయ్ సింగ్, హనుమంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, సాయి, నరేశ్, ఈశ్వర్, రాజు, లోకనాథ్‌సింగ్, కిరణ్, నబీ బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానంద్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్‌కుమార్, ఇంద్రేశం మున్సిపల్ కౌన్సిలర్లు అంతిరెడ్డి, దుర్గారెడ్డి, కో ఆప్షన్ సభ్యులు శివారెడ్డి, సల్మాన్, నాయకులు రామచందర్, దుర్గేశ్, సాయికిరణ్చారి పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

