Patancheru | పటాన్చెరు, సెప్టెంబర్ 20 : విద్యుత్ సమస్యను పరిష్కరించేందుకు కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకుంటున్నామని కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ తెలిపారు. శనివారం పటాన్చెరు డివిజన్లోని పలు కాలనీలో విద్యుత్ అధికారులతో కలిసి పర్యటించి సమస్యలు తెలుసుకుని పరిష్కరిస్తామని తెలిపారు.
జేపీ కాలనీలో ఏర్పాటుచేసిన నూతన విద్యుత్ స్తంభాలను పరిశీలించి, సమస్యలు పరిష్కారం చేశామని తెలిపారు. శిశు మందిర్ కాలనీలో నూతనంగా నిర్మాణం చేస్తున్న సిసి రోడ్ పనులను పరిశీలించి నాణ్యతగా చేయాలని అధికారులకు సూచించారు. సిసి రోడ్డు నిర్మాణ పనుల్లో నాణ్యత లేకపోతే పై అధికారులకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. సీసీ రోడ్డు పనులు త్వరగా పూర్తిచేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్పొరేటర్ వెంట విద్యుత్ శాఖ డీఇ భాస్కరరావు, ఏఈ జగదీష్ తదితరులు ఉన్నారు.