Grama Panchayat | పటాన్చెరు, అక్టోబర్ 23: సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలో ఇక మీదట దాదాపు గ్రామ పంచాయతీ అనేది ఉండకపోవచ్చు.ఈ మేరకు ముఖ్య ప్రజాప్రతినిధి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం చకచకా చర్యలు తీసుకుంటున్నది. ఈ మధ్యే 11 గ్రా మాలను రెండు మున్సిపాలిటీల్లో విలీనం చేసిన సంగతతి తెలిసిందే. రామచంద్రాపు రం మండలం, అమీన్‌ఫూర్ మండలాల్లోని గ్రామాలు వందశాతం మున్సిపాలిటీలుగా మారాయి. పటాన్చెరు మండలంలో 19 గ్రా మ పంచాయతీల్లో ఐదు తెల్లాపూర్ మున్సిపాలిటీలో కలిపారు. మిగిలిన 14 పంచాయతీలను కూడా ఇస్నాపూర్, భానూర్, ఇం ద్రేశం మున్సిపాలిటీలుగా చేసేందుకు పరిశీలన చేసి రిపోర్టు ఇవ్వాలని అధికారులకు ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయి.
అధికారులు అన్ని గ్రామాల వివరాలను సేకరించి ప్రభుత్వానికి పంపుతున్నారు. మూడు ము న్సిపాలిటీలు ఏర్పటైతే పటాన్చెరు మండలం లో ఒక్క గ్రామపంచాయతీ కూడా ఉండదు. మరో పక్క జిన్నారం మండలంలోని గడ్డపోతారాన్ని మున్సిపాలిటీ చేసేందుకు అధికారులు వివరాలు సేకరిస్తున్నారు. గుమ్మడిదల మండలంలోని ఆరు గ్రామాలతో గుమ్మడిదలను మున్సిపాలిటీ చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గంలో గుమ్మడిదల మండలంలో ఏడు, జిన్నారం మండలంలో తొమ్మిది గ్రామాలు మాత్రమే పంచాయతీలుగా మిగలనుండగా, వాటిని కూడా మున్సిపాలిటీల్లో విలీనం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
పటాన్చెరు, జిన్నారం, గుమ్మడిదల మండలాల్లో నూతనంగా మున్సిపాలిటీలు ఏర్పాటు చేసేందుకు ముఖ్యప్రజాప్రతినిధి తెచ్చిన ప్రతిపాదనపై గ్రామాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్‌కు ఆదేశాలు ఇవ్వగా, కలెక్టర్ ఆదేశాల మేరకు అధికారులు రికార్డులు, రిపోర్టులు సిద్ధం చేస్తున్నారు. వా రంక్రితం వరకు పటాన్చెరు నియోజకవర్గం లో ఇస్నాపూర్ పంచాయతీ పాశమైలారం, చిట్కుల్‌తో కలిపి మున్సిపాలిటీగా చేస్తున్నారనే ప్రచారం జరిగింది.
స్థానికంగా ముఖ్య ప్రజాప్రతినిధి గ్రామాలన్నీ పట్టణీకరణ అవుతున్న సందర్భంగా మొత్తం నియోజకవర్గం మున్సిపాలిటీలుగా చేయాలని సీఎం రేవంత్‌రెడ్డికి ప్రతిపాదించారని సమాచారం. ఈ మేరకు ప్రభుత్వం నుంచి మరికొన్ని మున్సిపాలిటీలు ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని సంగారెడ్డి కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చాయి. దాంట్లో భాగంగా అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా, ఎంపీటీసీలు, ఎంపీపీలుగా, జడ్పీటీసీలుగా పోటీ చేసేందుకు గ్రామాల్లో పలువురు నాయకులు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే సర్పంచ్‌లుగా బరిలో ఉంటున్నామని కొందరు రూ.లక్షలు ఖర్చు చేశారు. సామాజిక సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు చందాలు ఇస్తున్నారు.
ఇప్పుడు అన్ని గ్రామాలు మున్సిపాలిటీలుగా మారబోతున్నాయని ప్రచారం కా వడంతో వారు దిగ్భ్రాంతి చెందుతున్నారు. గ్రామాల్లో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. చిన్నపాటి గ్రామాలను సైతం పంచాయతీల నుంచి మున్సిపాలిటీల్లో విలీనం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీల ఏర్పాటుతో పన్నులు పెరుగుతాయని, పేదల బతుకులు దుర్భరంగా మారుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్తుల అభిప్రాయాలు తీసుకోకుండా మున్సిపాలిటీల్లో ఎలా కలుపుతారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే తెల్లాపూర్, అమీన్‌ఫూర్ మండలా ల్లో విలీనం చేసిన 11 గ్రామాల ప్రజలకు సేవ లు అందడం లేదు. తాగునీరు, సంపూర్ణ పారిశుధ్యానికి నోచుకోవడం లేదనే అంశాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.
ఇస్నాపూర్ మున్సిపాలిటీలో చిట్కుల్, రు ద్రారం, లక్డారం, పాశమైలారం గ్రామాలు, ఇంద్రేశం మున్సిపాలిటీలో రామేశ్వరంబండ, బచ్చుగూడ, ఐనోల్, చిన్నకంజర్ల, పెద్దకంజర్ల, భానూర్ మున్సిపాలిటీలో నందిగామ, క్యాసారం, గుమ్మడిదల మున్సిపాలిటీలో అన్నారం, బొంతపల్లి, వీరన్నగూడెం, దోమడుగు, మంబాపూర్, గడ్డపోతారం మున్సిపాలిటీలో వావిలాల, లక్ష్మీపతిగూడెం, మాదా రం, కాజీపల్లి, నల్తూర్ గ్రామాలు ఉండబోతున్నాయి. వీటికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. త్వరలో ఎన్ని మున్సిపాలిటీలు ఏర్పడుతాయి అనేది ప్రభుత్వం తీసుకునే నిర్ణయంపై అధారపడి ఉంటుంది. ము న్సిపాలిటీలు ఏర్పాటు చేసేందుకు జనాభా ఎక్కువ ఉండాలి. జనాభా లేని కారణంగానే చుట్టు ఉన్న గ్రామాలను కలిపి జనాభా పెంచే ప్రయత్నం చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
పటాన్చెరు మండలంలోని అన్ని గ్రామాలు మున్సిపాలిటీలో విలీన మయ్యేలా మండల ప్రజాపరిషత్ కార్యాలయం సిబ్బంది ప్రతిపాదిం చారు. అర్బన్ లక్షణాలు, వేగంగా పట్టణీకరణ జరుగుతున్న గ్రామా లుగా గుర్తించి ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారులకు అంద జేశారు. మండలంలో మూడు మున్సిపాలిటీలు చేయా లని ప్రతి పా దనలు పంపించారు. ఇప్పటికే ముత్తంగి, కర్ధనూర్, పాటి, ఘనపూర్, పోచారం గ్రామాలు తెల్లాపూర్ మున్సిపాలిటీలో విలీనమయ్యాయి.
– ఇస్నాపూర్ జనాభా 19,136, చిట్కుల్ జనాభా 10,038, రుద్రారం జనాభా 7,425, లక్డారం జనాభా 4,399, పాశమైలారం జనాభా 4,214 ఒక మున్సిపాలిటీగా గుర్తించారు. మొత్తం జనాభా 45,212మంది ఉన్నారు.
– భానూర్ 18,406, నందిగామ 4,585, క్యాసారం 3,010 గుర్తించారు. మొత్తం జనాభా 26,002 మంది ఉన్నారు.
– ఇంద్రేశం జనాభా 5,527, బచ్చుగూడెం 999, రామేశ్వరంబండ జనాభా 4025, ఐనోల్ 4,035, పెద్దకంజర్ల జనాభా 2,182, చిన్న కంజర్ల జనాభా 1,975 మొత్తం జనాభా 16,057 మంది ఉన్నారు.