గుమ్మడిదల, ఫిబ్రవరి 27: డంపుయార్డు ఏర్పాటు చేసి తమ బతుకులు నాశనం చేయవద్దంటూ జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం గుమ్మడిదలలో రైతు జేఏసీ అధ్యక్షుడు చిమ్ముల జైపాల్రెడి అధ్యక్షతన 23వ రోజు రిలే నిరాహార దీక్ష కొనసాగింది. దీక్షలో మండలంలోని చర్చిల పాస్టర్లు పాల్గొని డంపింగ్‌యార్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రూ.5 వేలు విరాళం అందజేశారు. నల్లవల్లి 23వ రోజు వృద్ధులు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. కొత్తపల్లిలో 23 రిలే నిరాహార దీక్షలో యువకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుమ్మడిదలలో పాస్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు దినకర్ మాట్లాడుతూ.. ప్రభుత్వం డంపుయార్డు ఏర్పాటును వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు.
డంపుయార్డు ఏర్పాటుతో ఈ ప్రాంతం అన్నివిధాలుగా నష్టపోతుందని తెలిపారు. నల్లవల్లిలో బుధవారం రాత్రి మహాశివరాత్రి జాగారంలో భాగంగా రిలే నిరాహార దీక్ష శిబిరంలో జవహర్ నగర్ డంపింగ్‌యార్డు వల్ల అక్కడి ప్రజలు పడుతున్న బాధలు, అనారోగ్య సమస్యలు, పర్యావరణం, భూగర్భజలాలు కలుషితం గురించి ప్రొజెక్టర్ ద్వారా స్థానికులు తెలుసుకున్నారు. 23వ రోజు రిలే నిరాహార దీక్షలో వృద్ధులు పాల్గొన్నారు. దీక్షలో పాస్టర్స్ మత్యుకుటు, పద్యారావు, పాల్సన్, జాన్‌పాల్, వరప్రసాద్ స్టీవెల్, సామ్యూల్‌పాల్, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్ చిమ్ముల నర్సింహారెడ్డి, జేఏసీ నాయకులు గోవర్ధన్‌రెడ్డి, పుట్టనర్సింగ్రావు, నరేందర్‌రెడ్డి, మద్దుల బాల్‌రెడ్డి, సదానందరెడ్డి, మోహన్‌రెడ్డి, కాలకంటి రవీందర్‌రెడ్డి, ఉదయ్‌కుమార్, బాల్‌రెడ్డి, స్వేచ్చారెడ్డి, ఆలేటి శ్రీనివాస్‌రెడ్డి,ప్రతాప్‌రెడ్డి, వీరారెడ్డి, సంజీవరెడ్డి, లక్ష్మారెడ్డి, దేవేందర్‌రెడ్డి, నాగేందర్‌గౌడ్, జయశంకర్‌గౌడ్, ప్రవీణ్‌రెడ్డి, మల్లేశ్‌గౌడ్, బాలు, తుడుం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు దూరం…
డంపింగ్‌యార్డు ఏర్పాటుకు వ్యతిరేకంగా గుమ్మిడిదల మండలంలో పట్టభద్రులు ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌కు స్వచ్ఛందంగా దూరంగా ఉన్నారు. గుమ్మడిదలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌స్టేషన్ నంబర్ 425లో పట్టభద్ర ఓటర్లు 295 మంది ఉన్నారు. వీరిలో కేవలం నాన్‌లోకల్ పట్టభద్రుల ఓటర్లు 42 మంత్రి ఓటు వేశారు. మిగిలిన 253 మంది స్థానిక పట్టభద్రులు ఓటు వేయకుండా ప్రభుత్వానికి తమ నిరసన తెలిపారు. మూడు రోజుల క్రితం డంపింగ్‌యార్డు వ్యతిరేక జేఏసీ, పట్టభద్రులు సమావేశమై ఎమ్మెల్సీ ఎన్నికలకు దూరంగా ఉండాలని తీర్మానం చేశారు. గుమ్మిడిదల మండలంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఓట్లు 19 ఉండగా, 18 పోలయ్యాయి.