కిక్కులో డ్రైవర్..
మద్యం తాగి ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడిపించడంతో భయాందోళనలు చెందిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. బ్రీతింగ్ పరీక్షలు చేసిన నర్సాపూర్ పోలీసులు సోమవారం బస్సును నర్సాపూర్ బస్టాండ్‌లో నిలిపివేశారు. వివరాల్లోకెళితే.. మేడ్చల్ నుంచి నర్సాపూర్‌కు వస్తున్న బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు.
- భయంలో ప్యాసింజర్లు
- మద్యం తాగి బస్సు నడిపిన ఆర్టీసీ డ్రైవర్
- మెదక్ జిల్లా నర్సాపూర్‌లో ఘటన
నర్సాపూర్, మే 4: మద్యం తాగి ఆర్టీసీ డ్రైవర్ బస్సు నడిపించడంతో భయాందోళనలు చెందిన ప్రయాణికులు పోలీసులకు సమాచారం అందించారు. బ్రీతింగ్ పరీక్షలు చేసిన నర్సాపూర్ పోలీసులు సోమవారం బస్సును నర్సాపూర్ బస్టాండ్‌లో నిలిపివేశారు. వివరాల్లోకెళితే.. మేడ్చల్ నుంచి నర్సాపూర్‌కు వస్తున్న బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నారు. మేడ్చల్ డిపోకు చెందిన ఆర్టీసీ డ్రైవర్ తిరుమలేశ్ బస్సులోని ప్రయాణికులపై చిరాకుపడుతున్నాడు.
దీంతో అనుమానం వచ్చిన ప్రయాణికులు డ్రైవర్ మద్యం తాగి బస్సు నడుపుతున్నాడని గుర్తించారు. వెంటనే నర్సాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు బస్సు డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని బ్రీతింగ్ పరీక్షలు చేశారు. మద్యం తాగినట్లు గుర్తించారు. డ్రైవర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని డ్రైంక్ అండ్ డ్రైవ్ కేసు నమోదు చేసినట్లు నర్సాపూర్ పోలీసులు తెలిపారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
- Tags
- Alcohol
- Bus
- Passengers
- TGRTC driver
RELATED ARTICLES
తాజా వార్తలు
ఆ 2,006 ఎకరాలపైనా విచారించండి.. రేవంత్ కుటుంబం, మంత్రులు, కాంగ్రెస్ నేతల భూములపైనా విచారణ జరుపాలి
అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
కరువుపై కాంగ్రెస్ సర్కార్ చోద్యం
నేడు సింగరేణి గర్జన
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

