మెదక్, మార్చి 16 (నమస్తే తెలంగాణ) : కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ పార్లమెం ట్ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమ లు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికా స్రాజ్, డీజీపీ రవిగుప్తా, రాష్ట్రస్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి పార్లమెంట్ సాధారణ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లా ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సమావేశానికి కలెక్టరేట్ నుంచి కలెక్టర్ రాహు ల్రాజ్, ఎస్పీ బాలస్వామి, అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు, రమేశ్ పాల్గొన్నారు.
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్ రాజ్ మాట్లాడుతూ… దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చింద న్నారు. దేశంలో 7 విడతల్లో పార్లమెంట్ సా ధారణ ఎన్నికలు జరుగుతాయని, తెలంగాణ లో పోలింగ్ నాలుగో విడతలో మే 13న పో లింగ్ జరుగుతుందని, జూన్ 4న కౌంటింగ్ ఉంటుందన్నారు. తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలకు ఏప్రిల్ 18న ఎన్నికల కమిషన్ నో టిఫికేషన్ జారీ చేస్తుందని, ఏప్రిల్ 18 నుంచి ఏప్రిల్ 25 వరకు నామినేషన్ల స్వీకరణ, ఏప్రి ల్ 26న నామినేషన్ల స్రూటినీ, ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుందన్నారు.
ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, 24 గంటల వ్యవధిలో ప్రతి ప్రభుత్వ భవనంలో రాజకీయ పార్టీలకు సం బంధించిన హోర్డింగులు, నాయకుల ఫొటో లు, వాల్‌రైటింగ్స్ తొలిగించాలని ఆదేశించా రు. 48 గంటల వ్యవధిలో పబ్లిక్ ప్రాపర్టీస్ వద్ద, 72 గంటల్లో ప్రైవేట్ స్థలాల్లో ఫ్లెక్సీలు, హోర్డింగ్‌లు తొలగించాలని అధికారులను ఆ దేశించారు. రాష్ట్ర ప్రభుత్వశాఖల వెబ్‌సైట్‌ల్లో సీఎం, మంత్రుల ఫొటోలను తొలిగించాలని అన్నారు. పార్టీలు, ర్యాలీలు, సభలకు ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ విధానంలో అనుమతులు ఇ వ్వాలని సూచించారు. నగదు, మద్యం అరిక ట్టడానికి చర్యలు చేపట్టాలని, చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనీఖీలు నిర్వహించాలన్నారు.
ఆధారాలు లేకుండా రూ.50 వేలకు మించి న గదు తీసుకెళ్లొద్దని సూచించారు. నగదు జప్తు చేసే సమయంలో మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలన్నారు. ఎన్నికల రిపోర్ట్లు ప్రతిరోజూ సమర్పించే విధంగా జిల్లాలో వ్యవ స్థ ఏర్పాటు చేయాలని సూచించారు. విద్వేషా లు పెంచే విధంగా వ్యాఖ్యలు చేయడం నిషేధమన్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేయ డం, బెదిరించడంపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎన్ని కలపై నమ్మకం కోల్పోయే విధంగా అసత్య ప్రచారాలు చేస్తే చర్యలు తీసుకోవాలన్నారు.
– కలెక్టర్ రాహు ల్రాజ్
వీడియో కాన్ఫరెన్స్ అనంతరం కలెక్టర్ రా హుల్రాజ్ అధికారులతో మాట్లాడారు. ఎన్ని కల నియమ నిబంధనలపై రాజకీయ పార్టీల కు సమాచారం ఇవ్వాలని, సువిధా యాప్‌లో వచ్చే దరఖాస్తులను పరిశీలించాలని, నిబంధనల ప్రకారం అభ్యర్థులకు అనుమతులు మం జూరు చేయాలన్నారు. జిల్లాలో 24 గంటల పాటు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలపై వచ్చే ప్రతి ఫిర్యాదును పరిషరించాలని ఆదేశించారు. సమావే శంలో అదనపు ఎస్పీ మహేందర్, జడ్పీ సీఈ వో ఎల్లయ్య, డీఆర్డీఏ శ్రీనివాసరావు, మెదక్ ఆర్డీవో రమాదేవి, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మెదక్ తహసీల్దార్ శ్రీనివాస్, ఎలక్షన్ సూపరింటెండెంట్ హార్డీప్సింగ్ ఉన్నారు.