నర్సాపూర్ : నర్సాపూర్ ‘మెయిన్ రోడ్డుపై దుర్గంధం..మూడు రోజులైనా పట్టించుకునేవారే లేరా’..అంటూ నమస్తే తెలంగాణ వెబ్సైట్లో ఆదివారం ప్రచురితమైన వార్తకు గ్రామపంచాయతీ సిబ్బంది స్పందించారు. గత మూడు రోజుల క్రితం గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ కుక్క మృతి చెందగా దానిని తొలగించక పోవడంతో పూర్తిగా కుళ్లిపోయి దుర్గంధం వెదజల్లుతుంది.
అటుగా వెళ్లే ప్రయాణికులు ఈ దుర్గంధాన్ని తట్టుకోలేక నానా అవస్థలు పడ్డారు. ఈ వార్తను నమస్తే తెలంగాణ వెబ్ పేజీలో ప్రచురించగా ఎంపీఓ మహ్మద్ మోజామ్ హుస్సేన్ ఆదేశాల మేరకు బ్రాహ్మణపల్లి గ్రామపంచాయతీ పారిశుద్ధ కార్మికులు కుక్క కళేబరాన్ని తొలగించారు. దీనితో ప్రయాణికులు ఊపిరి పీల్చుకొని నమస్తే తెలంగాణకు ధన్యవాదాలు తెలిపారు.