
మెదక్ : విధుల్లో నిర్లక్ష్యం ప్రదర్శించినందుకు శివ్వంపేట మండల పంచాయతీ అధికారి శరత్ కుమార్ రెడ్డిని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాహాజరు అవడం, విధుల పట్ల అలసత్వం ప్రదర్శించినందుకు గాను పంచాయత్ రాజ్ చట్టంలోని సెక్షన్ 51 (19) 2018 ప్రకారం అతనిని విధుల నుంచి కలెక్టర్ సస్పెండ్ చేశారని ఆయన పేర్కొన్నారు.