ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి పద్మశాలీల మద్దతు
పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి నియోజకవర్గ పద్మశాలీ సంఘం మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో పద్మశాలీ సంఘం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు.
- పద్మశాలీల సంక్షేమానికి కృషి చేస్తానని హామీనిచ్చిన మహిపాల్‌రెడ్డి
పటాన్చెరు, అక్టోబర్ 27: పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డికి నియోజకవర్గ పద్మశాలీ సంఘం మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. శుక్రవారం పటాన్చెరు పట్టణంలో పద్మశాలీ సంఘం నియోజకవర్గ స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ పద్మశాలీ సంఘం ఏకగ్రీవంగా ఎమ్మెల్యేకు మద్దతు తెలుపుతూ తీర్మా నం చేశారు. అనంతరం ఎమ్మెల్యేను కలిసి తమ నిర్ణయాన్ని వెళ్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మె ల్యే మాట్లాడుతూ పద్మశాలీ సంఘం తనకు మద్ద తు ఇవ్వడంపై కృతజ్ఞతలు తెలిపారు. 60 ఏండ్ల లో సాధించని ప్రగతిని దశాబ్దకాలంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి చూపించిందన్నారు. సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాల సంక్షేమం అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైన పద్మశాలీలకు గుర్తింపునిచ్చి ప్రోత్సహించిన ప్రభుత్వం తమదన్నారు. నియోజకవర్గంలోని పద్మశాలీల సంక్షేమానికి క ట్టుబడి ఉన్నామన్నారు. గతంలో కాంగ్రెస్ నాయకులు నేత కార్మికులను అసలు పట్టించుకోలేదని గుర్తు చేశారు.
రాయితీలు ఇవ్వకుండా, నిధులు కేటాయించకుండా ఇబ్బందులు సృష్టించారన్నా రు. పరిశ్రమలను మూసివేస్తూ, సంఘాల నుంచి ఖరీదు చేయకుండా కార్మికులను రోడ్డుపాలు చేశారని విమర్శించారు. బీఆర్ఎస్ సర్కారు ద్వారా మంత్రి కేటీఆర్ పద్మశాలీలకు సముచిత స్థానం కల్పిస్తూ, వారిని అన్ని రంగాల్లో ముందంజలో నిలుపుతున్నారని కొనియాడారు. కార్మికులకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అండగా నిలుస్తున్నారన్నారు. నేతన్నల కోసం తెలంగాణ సర్కా రు చేనేత బీమా పథకాన్ని ప్రవేశపెట్టి వారి కుటుంబాలకు భరోసా ఇచ్చిందన్నారు. కార్మికులకు నూలు, రసాయనాలు, రంగుల్లో రాయితీలు ఇ స్తూ నేరుగా వారి ఖాతాల్లోనే డబ్బులు జమ చేస్తున్నదని వివరించారు. సంఘాల్లో ఉన్న రూ. 10 కోట్ల విలువైన స్టాక్‌ను కూడా టెస్కో ద్వారా కొనుగోలు చేసినట్లు తెలిపారు. పటాన్చెరు నియోజకవర్గంలోని పద్మశాలీలకు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో పెద్దపీట వేశామన్నారు. వారి అభివృద్ధికి కృషి చేస్తానని, ఏ సమస్యతో వచ్చినా తక్షణం వాటిని పరిష్కరిస్తానని ఎమ్మెల్యే హామీనిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ వంగరి అశోక్, సీనియర్ నాయకులు మ్యాకం మల్లేశ్, పద్మశాలీ సంఘం ప్రతినిధులు వేముల రమేశ్, భాస్కర్, నర్సింలు, సోమదాసు, వీర నారాయణ, చిరంజీవి, నగేశ్, విట్టల్ రాజు, నాగభూషనం, వాసు, గుర్రం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

